యాప్నగరం

తెలంగాణ కోర్టులకు లాక్‌డౌన్ పొడిగింపు.. హైకోర్టు ఉత్తర్వులు

TS High Court: కరోనా నేపథ్యంలో మార్చి నుంచి హైకోర్టు సహా పలు కోర్టుల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ విధానంలోనే కోర్టులు విధులు నిర్వహిస్తున్నాయి.

Samayam Telugu 11 Aug 2020, 4:13 pm
తెలంగాణలోని అన్ని కోర్టులు, ట్రైబ్యునళ్లకు లాక్‌డౌన్‌ను సెప్టెంబర్‌ 5 వరకు పొడిగిస్తున్నట్టుగా హైకోర్టు మంగళవారం ప్రకటించింది. అయితే, అత్యవసర కేసులను మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరపాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పిటిషన్‌లను ఆన్‌లైన్‌తో పాటు నేరుగా కోర్టులో దాఖలు చేసేందుకు అవకాశం ఉందని హైకోర్టు మంగళవారం నాటి ఉత్తర్వుల్లో వెల్లడించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
telangana high court


కరోనా నేపథ్యంలో మార్చి నుంచి హైకోర్టు సహా పలు కోర్టుల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ విధానంలోనే కోర్టులు విధులు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1896 కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మంగళవారం నాటికి 82 వేలు దాటాయి. కరోనాతో గత 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 645కి చేరుకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.