యాప్నగరం

హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్! ఎప్పుడంటే.. తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas: లాక్ డౌన్ సడలించిన అనంతరం జీహెచ్ఎంసీ పరిధిలోనే రోజుకు సరాసరిన 150 వరకూ కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు వివరించారు.

Samayam Telugu 12 Jun 2020, 7:47 pm
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పారు. నగర పరిధిలో పూర్తి లాక్ డౌన్ మళ్లీ విధించాలా లేదా అన్న అంశంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని వివరించారు. మరో రెండు లేదా మూడు రోజుల్లోపు సీఎం కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని, లాక్ డౌన్ అంశంపై ఆయనే స్వయంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. శుక్రవారం తలసాని ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Samayam Telugu తలసాని శ్రీనివాస్ యాదవ్ (ఫైల్ ఫోటో)
Talasani


లాక్ డౌన్ సడలించిన అనంతరం జీహెచ్ఎంసీ పరిధిలోనే రోజుకు సరాసరిన 150 వరకూ కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు వివరించారు. పటిష్ఠ లాక్ డౌన్ విధించిన సందర్భంలోనూ కొన్ని వెసులుబాట్లు ఇచ్చామని, దాన్ని అలుసుగా తీసుకొని చాలా మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారని గుర్తు చేశారు.

Must Read: undefined

కరోనాను కట్టడి చేయలేకపోతున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర బీజేపీ చేస్తున్న ఆరోపణలు, ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాలపై మంత్రి స్పందిస్తూ.. అవన్నీ పొలిటికల్ డ్రామాలని కొట్టిపారేశారు. కావాలంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముట్టడి చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం వైన్ షాపులు, ఎయిర్ పోర్టులు, రెస్టారెంట్లకు ఇచ్చిన సడలింపులన్నీ కేంద్రమే ఇచ్చిందని, ఈ బీజేపీ నాయకులు ప్రధాని మోదీని అడగాలని తేల్చి చెప్పారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.