యాప్నగరం

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు

బంగాళాఖాతంలో బుధవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Samayam Telugu 19 Aug 2020, 8:23 am
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్ని వానలు ముంచెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. దీంతో అనేకమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనిప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Samayam Telugu మరో రెండు రోజులు వర్షాలు
telangana rains


రాష్ట్రంలో నేటి నుంచి 48 గంటలపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్‌, దాని పరిసరాల్లో ఉన్న ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతంలో అల్పపీడనం మంగళవారం ఉదయం బలహీనపడింది. అయినప్పటికీ దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించింది.
Read More: రూ.10వేలు కావాలంటే.. GHMCకి కాల్ చేయండి
మరోవైపు భారీ వర్షాలతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులకు జలకళ సంతరించుకున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 570.60 అడుగులకు చేరింది. అలాగే ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 71,651 క్యూసెక్కులు... అవుట్ ఫ్లో 4,010 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. మరోవైపు గోదావరి నదికి కూడా వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద గోదావరి ఉరకలు వేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.