యాప్నగరం

తెలంగాణ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్.. వరంగల్‌లో మైండ్‌ట్రీ

తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వరంగల్‌లో మైండ్ ట్రీ కేంద్రం ఏర్పాటు అవుతుందన్నారు. ఇందుకు ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించిందన్నారు.

Samayam Telugu 8 Feb 2020, 11:28 am
జేబీఎస్-ఎంజీబీఎస్ స్టేషన్ల మధ్య హైదరాబాద్ మెట్రో రైలు సేవలు ప్రారంభమైన వేళ.. తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. వరంగల్‌లో మైండ్ ట్రీ కేంద్రాన్ని ప్రారంభించడానికి ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించిందని తెలిపారు. ‘జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో లైన్ ప్రారంభం తర్వాత మరో శుభవార్త చెబుతున్నా. వరంగల్ నగరంలో మైండ్ ట్రీ కేంద్రాన్ని ప్రారంభించాలన్న సీఎం కేసీఆర్ సలహాకు ఎల్ అండ్ టీ సీఈవో అండ్ ఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు అంగీకరించారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Samayam Telugu ktr


ఐటీ సంస్థలు ఇప్పటి వరకూ హైదరాబాద్ నగరానికే పరిమితం అయ్యాయి. కాగా తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం నగరాలకూ ఐటీ సేవలను విస్తరించాలని సర్కారు భావిస్తోంది. హైదరాబాద్‌లో తూర్పున ఉన్న ఉప్పల్ ప్రాంతంలో ఐటీ కంపెనీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తే.. హైదరాబాద్-వరంగల్ నగరాలు ముంబై-పుణే తరహాలో డెవలప్ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.