యాప్నగరం

కరోనాతో మాదాపూర్ ఎస్ఐ మృతి.. పోలీస్ శాఖలో ఆందోళన

పోలీస్ శాఖలో కరోనా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు పోలీసులు, ఉన్నతాధికారులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 18 Sep 2020, 12:46 pm
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ వైరస్ బారిన పడి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాపై పోరులో ముందున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌పై తీవ్ర ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే వైరస్‌ బారినపడి డాక్టర్లు, పోలీసులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో అధికారులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనాసోకి మాదాపూర్‌ ఎస్‌ఐ అబ్బాస్‌ అలీ మృతిచెందారు. ఉన్నతాధికారులతో పాటు, పోలీసులు, హోంగార్డులు కరోనా బారిన పడి చనిపోయారు.
Samayam Telugu కరోనాతో మాదాపూర్ ఎస్ఐ మృతి
madhapur si dies with corona


గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అలీకి ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై రాష్ట్ర పోలీస్‌ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరోవైపు తెలంగాణలో తాాజాగా కరోనా మరణాల సంఖ్య కూడా వెయ్యి దాటింది.

Read More: నేరెడిమేట్‌లో విషాదం.. భారీ వర్షానికి బాలిక అదృశ్యం

తాజాగా తెలంగాణలో 2,043 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11, మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,016కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,802 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,67,046కి చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.