యాప్నగరం

TPCC: నేనేం చెంచాగిరి చేయట్లేదు.. వీహెచ్ వ్యాఖ్యలకు మల్లు రవి కౌంటర్

Hyderabad: వీహెచ్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ మల్లు రవి శనివారం స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివి సమాజంలో మార్పు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.

Samayam Telugu 26 Dec 2020, 7:07 pm
మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వనున్నారనే వార్తల వేళ ఆయనపై, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్‌పై సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీహెచ్‌ వ్యాఖ్యలను మాజీ ఎంపీ మల్లు రవి ఖండించారు. తనకు ఎవరికీ చెంచాగిరీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రేవంత్‌కు పీసీసీ ఇవ్వాలని తాను బహిరంగంగానే చెప్పానని, చెంచాగిరీ చేయాల్సిన అవసరం తనకు లేదని వీహెచ్‌ను ప్రశ్నించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌పై విమర్శలు చేయడమంటే అధిష్ఠానంపై చేయడమేనని మల్లు రవి అన్నారు. ఏ పదవి ఎవరికి ఇవ్వాలో అధిష్ఠానానికి తెలుసునని మల్లు రవి చెప్పారు.
Samayam Telugu మల్లు రవి (ఫైల్ ఫోటో)
mallu ravi


వీహెచ్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ మల్లు రవి శనివారం స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివి సమాజంలో మార్పు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఎవరికీ తాను చెంచాగిరీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి విషయం తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఖరారైందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో విహెచ్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పదవి ఇస్తే తాను పార్టీలో ఉండబోనని వీహెచ్ అన్నారు.

తనతో పాటు ఇతర నాయకులు కూడా వారి దారి వారు చూసుకుంటారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డికే కాదు తనకు కూడా ప్రజల్లో క్రేజ్ ఉందని చెప్పారు రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న స్థితిలో ఆర్ఎస్ఎస్ వ్యక్తికి పీసీసీ పదవి ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తి కింద తాను పనిచేయబోనని చెప్పారు. రేవంత్‌ను ఉద్దేశించి వీహెచ్ శుక్రవారం విమర్శించారు. అంతేకాక, రేవంత్ రెడ్డికి అన్ని డబ్బులు ఎలా వచ్చాయో తేల్చాలని తాను సీబీఐకి లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.