యాప్నగరం

కరోనా భయం: చేతులెత్తి మొక్కినా కనికరం చూపలేదు.. రోడ్డుపైనే వ్యక్తి కన్నుమూత

Medak: సికింద్రాబాద్‌ నేరేడ్‌మెట్‌ ప్రాంతానికి చెందిన శ్రీనివాసబాబు అనే వ్యక్తి బస్సులో వెళుతూ తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. అప్పటికి బస్సు చేగుంటకు దగ్గర్లో ఉండడంతో అక్కడ దిగి ఆస్పత్రికి వెళ్దామని అనుకున్నాడు.

Samayam Telugu 10 Jun 2020, 11:53 pm
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మనుషుల్లోని మానవత్వాన్ని సైతం చంపుతోంది. దీన స్థితిలో కొన ఊపిరితో ఉండి సాయం కోసం అర్థించిన ఓ అభాగ్యుడిని కరోనా అనుమానంతో ఎవ్వరూ పట్టించుకోలేదు. కనీసం అతని దగ్గరికి వెళ్లేందుకు కూడా ధైర్యం చూపలేదు. అతను కాపాడండి అంటూ చేతులెత్తి మొక్కినా ఎవరూ కనికరం చూపలేదు. దీంతో సకాలంలో చికిత్స అందక అతని ప్రాణం గాల్లో కలిసి పోయింది. కన్నీరు పెట్టించే ఈ హృద్యమైన ఘటన మెదక్‌ జిల్లా చేగుంటలో చోటు చేసుకుంది.
Samayam Telugu చనిపోయిన వ్యక్తి (అంతర చిత్రంలో)
Dead hand


సికింద్రాబాద్‌ నేరేడ్‌మెట్‌ ప్రాంతానికి చెందిన శ్రీనివాసబాబు అనే వ్యక్తి బస్సులో వెళుతూ తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. అప్పటికి బస్సు చేగుంటకు దగ్గర్లో ఉండడంతో అక్కడ దిగి ఆస్పత్రికి వెళ్దామని అనుకున్నాడు. చేగుంటలో దిగి ఆస్పత్రికి వెళ్లే క్రమంలో కొద్ది దూరం నడిచాక సత్తువ లేక రోడ్డు పక్కన పడిపోయాడు.

Also Read: undefined

తనకు చేయందించి ఆస్పత్రికి చేర్చాలని అటుగా వెళ్లేవారిని వేడుకున్నాడు. అయినా ఎవరూ అతని మొర ఆలకించలేదు. కాపాడాలంటూ అక్కడున్న వారిని చేతులెత్తి మొక్కాడు. అత్యవరస చికిత్స తనకు అవసరమని త్వరగా ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేయాలని బతిమాలుకున్నాడు. కానీ, అతనికి కరోనా ఉందేమో అనే అనుమానంతో ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి శ్రీనివాసబాబు ఆరోగ్యం కొద్ది సేపట్లోనే మరింతగా క్షీణించి రోడ్డు పక్కనే చనిపోయాడు. తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.