యాప్నగరం

ఆన్‌లైన్ గేమ్స్ ఆడి ఉరేసుకున్న యువకుడు.. భార్యకు సెల్ఫీ వీడియో

Vanasthalipuram: వనస్థలిపురం ప్రాంతానికి చెందిన జగదీశ్‌ (33) అనే యువకుడు ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసైపోయాడు. ఆ గేమ్స్ ద్వారానే డబ్బు సంపాదించాలనే ఆశతో అదే పనిగా ఆడేవాడు.

Samayam Telugu 27 Nov 2020, 2:02 pm
ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిస కావడం ఓ వ్యక్తి నిండు ప్రాణం తీసింది. దీంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు తోడులేని వారయ్యారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో యువకుడు ఆన్‌లైన్ గేమ్స్ ఆడి, అప్పుల పాలై చేసేది లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌‌లోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది.
Samayam Telugu ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు
vanasthalipuram suicide


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన జగదీశ్‌ (33) అనే యువకుడు ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసైపోయాడు. ఆ గేమ్స్ ద్వారానే డబ్బు సంపాదించాలనే ఆశతో అదే పనిగా ఆడేవాడు. దీంతో తీవ్రంగా అప్పుల పాలయ్యాడు. ఇప్పటికే కొన్ని అప్పులు తీర్చినా ఇంకా డబ్బు చెల్లించేది ఉండడంతో వాటిని తీర్చే మార్గం లేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

తనను క్షమించాలని కోరుతూ తన భార్యకు ఆ సెల్ఫీ వీడియోను పంపాడు. జగదీశ్ గతంలో రూ.12 లక్షల వరకు అప్పులు తీర్చాడు. మిగతా అప్పును తీర్చేందుకు మరోసారి ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి బాగా నష్టపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.