యాప్నగరం

హైదరాబాద్‌లో అమానుష ఘటన.. ఆవుదూడపై అత్యాచారం

సరూర్ నగర్‌లో చైతన్యపురిలోని బయట కట్టి ఉంచ ఉన్న ఆవు దూడపై యూపీకి చెందిన వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. దీంతో అక్కడున్న స్థానికులు అతడ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు.

Samayam Telugu 2 Nov 2020, 9:08 pm
రంగారెడ్డి జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటు చేసుకుంది. కామవాంఛతో కళ్లు మూసుకుపోయిన కొందరు దుర్మార్గులు మూగజీవాల్ని సైతం వదలడం లేదు. తమ పైశాచికత్వం పశువులపై కూడా ప్రదర్శిస్తున్నారు. సరూర్ నగర్ లో ఓ యువకుడు ఆవు దూడపై అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన చైతన్య పురి కాలనీలో సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ లో ఉన్న చైతన్య పురి కాలనీ సాగర్ హిల్స్‌లో నివాస ముంటున్న నోముల సిద్ది రాజ్ (35) పాల వ్యాపారం చేస్తున్నాడు.
Samayam Telugu ఆవు దూడ (ఫైల్ ఫోటో)
cow calf rape


అతని వద్ద రెండు ఆవులు, 3 గేదెలు, రెండు దూడలు ఉన్నాయి. వాటన్నిటినీ ఇంటి ముందు ఉన్న ప్రాంతాల్లో కట్టి ఉంచాడు. సంజయ్ వర్మ(20) అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని బండా జిల్లాకు చెందినవాడు. ఉత్తరప్రదేశ్ నుండి హైదరాబాద్ కు వచ్చి ఎల్బీనగర్లో కూలిపని చేస్తూ నివసిస్తున్నాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో సంజయ్ వర్మ గోడదూకి వెళ్లి ఇంటి ముందు ఉన్న ప్రాంతంలో కట్టి ఉన్న ఆవు దూడ పై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Read More: హైదరాబాద్‌ మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం

వెంటనే అది గమనించిన యజమాని మరియు స్థానికులు అందరు కలిసి అతడ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అయితే అక్కడి నుండి సంజీవ్ వర్మ తప్పించు కున్నాడు. ఆవు యజమాని సిద్ది రాజ్ నిన్న ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సరూర్పో నగర్ పోలీసులు సంజీవ్ వర్మను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.