యాప్నగరం

కోటిన్నరకు అలుగు బేరం.. అడ్డం తిరిగిన కథ.. చివరకు ఇలా..!

అడవుల్లోకి వెళ్లి అలుగును పట్టుకున్నారు. కోటిన్నరకు బేరం పెట్టారు. కళ్లు మూసుకుంటే కోటిన్నర కళ్ల ముందు కదలాడుతున్న వేళ.. వారి కలలను పోలీసులు భగ్నం చేశారు.

Samayam Telugu 25 Jan 2021, 8:38 am
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని తాకిన వేళ.. పాంగోలిన్ అని పిలిచే అలుగు గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది. కరోనా వ్యాప్తికి ఇవే కారణమనే ప్రచారం జరిగింది. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టని ఈ జీవులను చైనా లాంటి కొన్ని దేశాల్లో ఆహారంగా తీసుకుంటారు. వీటిని క్యానర్స్ వ్యాధిని నియంత్రించే ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. వీటిపై ఉండే పొలుసులను చైనా సంప్రదాయ వైద్యంలో వాడతారు. అందుకే అలుగుకు బ్లాక్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
Samayam Telugu pangolin (File Photo)
The world's only scaled mammal, pangolins are quite shy and harmless


మంచిర్యాల జిల్లా కాసిపేటలో అలుగును పట్టుకున్న 8 మంది సభ్యుల ముఠా.. దాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యవర్తుల ద్వారా మూగజీవిని కోటిన్నరకు విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అటవీ సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. బెల్లంపల్లి మండలంలోని బుగ్గగుట్ట అడవిలో అలుగును పట్టుకున్నట్టు నిందితులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో అలుగును అక్రమంగా విక్రయించడానికి ప్రయత్నించడం ఇదే తొలిసారికాదు. గత ఏడాది ఆగస్టులో సిర్పూర్‌లో ఫారెస్ట్ అధికారులు అలుగును తరలిస్తోన్న 12 మందిని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో అలుగును పట్టుకొని.. యూట్యూబ్‌లో వీడియో పెట్టి.. రూ.65 లక్షలకు బేరం కుదుర్చుకున్న ముఠాను గత ఏడాది జులైలో అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.