యాప్నగరం

తెలంగాణలో మరో నగరానికి త్వరలో మెట్రో రైలు!

తెలంగాణలో మరో నగరంలో మెట్రో రైలు పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్ మహానగరంలో మెట్రో రైలు ఏర్పాటు కోసం మంత్రి కేటీఆర్ గతంలో చూపిన చొరవ ఫలితమే ఇదని చెబుతున్నారు. నగరంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన మహా మెట్రో సంస్థ ప్రతినిధులు బుధవారం వరంగల్‌ నగరానికి వచ్చి పరిశీలించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతితో చర్చలు జరిపారు. అనంతరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని నిర్ణయించారు. దీంతో వరంగల్‌ మహా నగరంలో మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు కీలక అడుగు పడింది.

Samayam Telugu 13 Feb 2020, 4:41 pm
తెలంగాణలో మరో నగరంలో మెట్రో రైలు పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్ మహానగరంలో మెట్రో రైలు ఏర్పాటు కోసం మంత్రి కేటీఆర్ గతంలో చూపిన చొరవ ఫలితమే ఇదని చెబుతున్నారు. నగరంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన మహా మెట్రో సంస్థ ప్రతినిధులు బుధవారం వరంగల్‌ నగరానికి వచ్చి పరిశీలించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతితో చర్చలు జరిపారు. అనంతరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని నిర్ణయించారు. దీంతో వరంగల్‌ మహా నగరంలో మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు కీలక అడుగు పడింది.
Samayam Telugu metro neo rail for warangal maha metro official surveys on wednesday
తెలంగాణలో మరో నగరానికి త్వరలో మెట్రో రైలు!


అంచనా వ్యయం ఎంతంటే..

వరంగల్‌ నగరంలో నియె మెట్రో రైలు వ్యవస్థ అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు అంచనాలు సుమారు రూ.2,700 కోట్ల వరకూ ఉన్నాయి. కాజీపేట నుంచి వరంగల్‌ రైల్వే స్టేషన్‌ వరకు మెట్రో రైలు వ్యవస్థ ఉండే అవకాశం ఉంది. 15 నుంచి 17 కిలో మీటర్ల పొడవు వరంగల్‌లోని ప్రధాన రహదారిపై నుంచి మెట్రో రైలు బ్రిడ్జి నిర్మిస్తారని తెలుస్తోంది.

డీపీఆర్‌ల తయారీకి నిర్ణయం

మహా మెట్రో సంస్థ ప్రతినిధులు రాజీవ్‌, రామ్‌ ఇతర ఉన్నతాధికారులు జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతితో జరిపిన చర్చల్లో భాగంగా నియో మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటు, ప్రయోజనాలు, నిధులు, ప్రాజెక్టు పూర్తయ్యే కాలం, ట్రాఫిక్ తగ్గుదల తదితర అంశాలను చర్చించారు. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత అతి పెద్ద నగరం వరంగల్‌ కావడంతో మెట్రో రైలు వ్యవస్థ ప్రాముఖ్యాన్ని సంస్థ ప్రతినిధులు వివరించారు. ఆ తరువాత ప్రాజెక్టు డీపీఆర్‌లు తయారు చేసే అంశంపై నిర్ణయం జరిగింది. మరో 15 రోజుల్లో డీపీఆర్‌ సిద్ధం చేస్తామని మెట్రో సంస్థ ప్రతినిధులు కమిషనర్‌కు చెప్పారు.

4 నెలల క్రితమే..

వరంగల్‌కు మెట్రో రైలు ప్రాజెక్టు కోసం నాలుగు నెలల క్రితమే మహా మెట్రో సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో ముంబయి, థానే, నాసిక్‌ తదితర ప్రాంతాల్లో నియో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహణను ఈ సంస్థ ప్రతినిధులు ఆ సమయంలో మంత్రికి చెప్పారు. ఈ విధానంలో మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుకు మంత్రి కేటీఆర్‌ ఒప్పుకున్నారు.

చిగురించిన ఆశలు

ఆ భేటీ అనంతరం మెట్రో సంస్థ ప్రతినిధులు తొలిసారిగా ఇప్పుడు వరంగల్‌లో పర్యటించారు. అప్పటి కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తోనూ గతంలో వీరు చర్చలు జరపగా.. అవి ముందుకు సాగలేదు. ప్రాజెక్టు భారీ ఖర్చు కావడంతో వరంగల్‌కు మెట్రో రాదేమో అని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా మెట్రో సంస్థ ప్రతినిధులు నగరాన్ని సందర్శించడం, డీపీఆర్‌ల సిద్ధానికి నిర్ణయం జరగడంతో మళ్లీ ఆశలు చిగురించాయి.

కి.మీ.కు రూ.180 కోట్లకే

నియో మెట్రోను లైట్ మెట్రో అని కూడా పిలుస్తారు. దీన్ని సాధారణంగా రెండు, మూడో శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థలో భౌగోళిక స్వరూపం, స్థల లభ్యతను బట్టి మెట్రో రైలు భూమిపై లేదా వంతెనపై వెళ్లేలా నిర్మిస్తారు. సాధారణంగా ఈ రకం మెట్రో ఒక కిలోమీటరు నిర్మాణానికి సగటున రూ.270 కోట్లు ఖర్చు కాగా, వరంగల్‌లో మాత్రం తాము రూ.180 కోట్లకే నిర్మిస్తామని మహా మెట్రో సంస్థ గతంలోనే వెల్లడించింది.

Must Read: గాంధీలో గందరగోళం: డాక్టర్ వసంత్ సంచలన ఆడియో టేప్.. లంచం కోసమేనా!

Also Read:
హైదరాబాద్ మెట్రో ఛార్జీలు ఇతర మెట్రోల కన్నా ఎక్కువ! ఎందుకిలా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.