యాప్నగరం

హైదరాబాద్‌లో మిల్క్ ఏటీఎం.. రాత్రి 10గంటల వరకు అందుబాటులో

ఉదయం 5 గంటల నుంచే ఈ మిల్క్ ఏటీఎం ప్రజల కోసం అందుబాటులో ఉంటుంది. ఏటీఎంపై లీటర్, అరలీటర్, పావు లీటర్ బటన్లు కూాడా ఏర్పాటు చేశారు.

Samayam Telugu 24 Oct 2020, 5:32 pm
పొద్దున్న లేస్తే అందరూ ఫ్రీజ్ ఓపెన్ చేసి వెతికేది పాల కోసమే. వేకువజామున వేడి వేడి టీ లేదా కాఫీ తాగందే చాలామందికి రోజు గడవదు. అందుకే పొద్దున్న లేవగానే అందరూ పాల ప్యాకెట్ల కోసం క్యూ కడతారు. కొన్ని ప్రాంతాల్లో తొందరగా వెళ్తేనే పాలు దొరికే పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ సమస్య లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు బటన్ నొక్కితే పాలు వచ్చే ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తొలిసారిగా మిల్క్ ఏటీఎంలను ప్రారంభించారు.
Samayam Telugu మిల్క్ ఏటీఎం
milk atm


రాష్ట్రంలోనే ఫస్ట్ పాల ఏటీఎం ను శ్రీ గీతా డెయిరీ చైర్మన్ లక్ష్మీనరసింహగుప్తా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌ పరిధిలో ఉన్న హస్తినాపురం డివిజన్‌ హనుమాన్‌నగర్‌ చౌరస్తాలో పాల సరఫరా ఏటీఎం కేంద్రం శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయంతో ఆ ప్రాంత ప్రజలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ఏటీఎంను వినియోగించాలనుకున్నవాళ్లు అవసరాల మేరకు అక్కడ ఉండే బటన్ నొక్కాల్సి ఉంటుంది. ఏటీఎం మిషన్‌లో లీటర్‌, అర లీటర్‌, పావు లీటర్‌ బటన్ ఏర్పాటు చేశారు. మనకు ఎన్నిపాలు కావాలంటే అన్నిపాలు బటన్ నొక్కగానే ఆ మేరకు ఒక పాత్రలోకి వస్తాయి.

Read More: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

ఇలా యంత్రం నుంచి బయటకి వచ్చిన పాలను ఇళ్లకు తీసుకెళ్లేందుకు వీలుగా మనం బాటిల్ లేదా డబ్బాను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే డబ్బులను మాత్రం అక్కడ ఉండే స్టాఫ్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. మార్కెట్‌ ధరల ప్రకారమే మిల్క్ ఏటీఎంల వద్ద పాల రేట్లు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ మిల్క్ ఏటీఎం రాష్ట్రంలోనే మొదటిదన్నారు. నిత్యం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మిల్క్ ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.