యాప్నగరం

50 ఎకరాలు అమ్ముకున్న తెలంగాణ మంత్రి

పాలకుర్తి మండలం చెన్నూరులో తన పేరిట ఉన్న భూమిని మంత్రి ఎర్రబెల్లి విక్రయించారు. మంత్రి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చినప్పుడు సబ్‌ రిజిస్ట్రార్‌ విజయజ్యోతి, ఉద్యోగులు ఈ సందర్భంగా ఎర్రబెల్లిని సన్మానించారు.

Samayam Telugu 10 Dec 2019, 11:22 am
తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తనకు సంబంధించిన 50 ఎకరాల భూమిని అమ్ముకున్నారు. ఈ మేరకు 50 ఎకరాల భూమి కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ పత్రాలను అందించారు. ఇందుకోసం ఆయన జనగామ జిల్లా కొడకండ్లలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చారు. పాలకుర్తి మండలం చెన్నూరులో తన పేరిట ఉన్న భూమిని మంత్రి ఎర్రబెల్లి విక్రయించారు. మంత్రి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చినప్పుడు సబ్‌రిజిస్ట్రార్‌ విజయజ్యోతి, ఉద్యోగులు ఈ సందర్భంగా మంత్రిని సన్మానించారు.
Samayam Telugu errabelli


అనంతరం మంత్రి వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, గతంలో ఉన్న ఏ సర్కారూ సక్రమంగా ఇలాంటి విధానాలు అమలు చేయలేదని మంత్రి అన్నారు. తర్వాత మంత్రి బస్ స్టేషన్‌ను ప్రారంభించారు.

Also Read: TSRTCకి కొత్త ఛైర్మన్ నియామకం? ఆ ఎమ్మెల్యేకే అవకాశం..

నర్సంపేట మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువులో నిర్వహించిన అయ్యప్పస్వామి పంబా ఆరట్టు వేడుకల్లోనూ మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. మండలంలో మరో పది రోజుల్లో తానే ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తానని మంత్రి ప్రకటించారు. మాధన్నపేట మినీట్యాంకు బండ్ నిర్మాణానికి హరీశ్ రావు నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిధులు కేటాయించారని, కానీ పనులు చేయకుండా నిర్లక్ష్యం చేశారని మంత్రి విమర్శించారు.

Also Read: Disha హత్యాచార నిందితుల్లో ఇద్దరు మైనర్లు..! కానీ..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.