యాప్నగరం

తెలంగాణలో మరో 3 రోజులు తుపాన్.. ప్రజలకు మంత్రి కీలక సూచనలు

Telangana Weather: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొర‌వ చూపి హెలికాప్టర్లు పంపించడం వల్లే వారిని సురక్షితంగా కాపాడగలిగామని ఎర్రబెల్లి వెల్లడించారు. ఎమ్మెల్యే గండ్ర, క‌లెక్టర్, ఎస్పీలు స్వయంగా ప‌ర్యవేక్షించ‌డం అభినందనీయమని కొనియాడారు.

Samayam Telugu 15 Aug 2020, 6:22 pm
జయశంకర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం కుందన్‌పల్లి గ్రామం చలి వాగులో చిక్కుకున్న రైతులను రెండు హెలికాప్టర్లు ఎట్టకేలకు కాపాడాయి. దీనిపై మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్పందించారు. రైతుల కుటుంబాల ద్వారా వాగులో చిక్కుకున్న వారి స‌మాచారం అంద‌డం, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొర‌వ చూపి హెలికాప్టర్లు పంపించడం వల్లే వారిని సురక్షితంగా కాపాడగలిగామని వెల్లడించారు. ఎమ్మెల్యే గండ్ర, క‌లెక్టర్, ఎస్పీలు స్వయంగా ప‌ర్యవేక్షించ‌డం అభినందనీయమని కొనియాడారు.
Samayam Telugu ఎర్రబెల్లి దయాకర్ రావు (ఫైల్ ఫోటో)
Errabelli Dayakar


ఎంతో కష్టపడి వాగులో చిక్కుకున్న 12 మంది రైతుల‌ను ర‌క్షించిన సహాయక బృందాన్ని మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. తుపాను మ‌రో రెండు మూడు రోజులు కొన‌సాగే అవకాశం ఉందని, కాబట్టి ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. అందరూ ఇళ్ళకే ప‌రిమిత‌ం కావడం మంచిదని మంత్రి సూచించారు. పాతకాలపు ఇళ్ళల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలం ప‌నుల‌ను రైతులు వానలు తగ్గేదాకా వాయిదా వేసుకోవాల‌ని చెప్పారు. వాగులు, వంక‌లు దాటి వ్యవ‌సాయ ప‌నులు చేసే సాహ‌సాలు చేయొద్దని మంత్రి అన్నారు.

Also Read: undefined

అయితే, ఇప్పటికే లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్రజ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్టుగా మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. అవ‌స‌ర‌మైతే, పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని సూచించిన‌ట్టు వెల్లడించారు. అధికారులు తుపాను త‌గ్గే వ‌ర‌కు ప‌రిస్థితుల‌ను ఎప్పటిక‌ప్పుడు స‌మీక్షిస్తూ ఉండాలని కోరారు.
Don't Miss Photos: తెలంగాణలో పంద్రాగస్టు వేడుకలు.. సీఎం సహా ప్రముఖుల జెండా ఆవిష్కరణ ఫోటోలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.