యాప్నగరం

అధైర్యపడొద్దు.. కరోనా స్ట్రెయిన్ వచ్చినా ఎదుర్కొంటాం: ఈటల రాజేందర్

Karimnagar: కరోనా కొత్త స్ట్రెయిన్‌ కలవరం పెడుతున్న సంగతి తెలిసిందే. బ్రిటన్ నుంచి వస్తున్నవారికి దేశంలోని విమానాశ్రయాల్లో తప్పనిసరిగా చేస్తున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ అవుతోంది.

Samayam Telugu 23 Dec 2020, 6:05 pm
కరోనా రెండో స్టేజ్‌ ఊహాగానాలపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. దీని గురించి ఆందోళన అవసరం లేదని భరోసానిచ్చారు. ప్రజలు ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి.. ఎయిర్‌పోర్టులోనే టెస్టులు చేసి నేరుగా ఐసోలేషన్‌కి పంపుతున్నామని చెప్పారు. సెకండ్ వేవ్ వచ్చినా లేదా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో బుధవారం నాడు మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)
etala rajender


కరోనా కొత్త స్ట్రెయిన్‌ కలవరం పెడుతున్న సంగతి తెలిసిందే. బ్రిటన్ నుంచి వస్తున్నవారికి దేశంలోని విమానాశ్రయాల్లో తప్పనిసరిగా చేస్తున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ అవుతోంది. మంగళవారం కొన్ని చోట్ల ఇలా 16 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరోవైపు ఈ నెల 11, 13 తేదీల్లో యూకే నుంచి తెలంగాణకు వచ్చిన ఇద్దరికి కూడా పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు. సెకండ్ వేవ్ రాకూడదని ఎలా తగ్గిపోయిందో అలాగే ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి అన్నారు.

ఒకవేళ కరోనా వైరస్ స్ట్రెయిన్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు. ప్రజలందరూ దైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. పరిశుభ్రత, కొవిడ్ సూత్రాలు ఎల్లప్పుడూ పాటిస్తూ ఉండాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.