యాప్నగరం

కరోనా సోకిందని 81 శాతం మందికి తెలియట్లేదు: ఈటల

Kamareddy: కరోనా ర్యాపిడ్ టెస్టులు చేయడంలో మన దగ్గర కాస్త ఆలస్యం అయిందని మంత్రి ఈటల అన్నారు. ఐసీఎంఆర్ ఆదేశాల ప్రకారం ర్యాపిడ్ టెస్టుల సంఖ్యను బాగా పెంచామని అన్నారు.

Samayam Telugu 26 Jul 2020, 7:23 pm
క‌రోనా వైర‌స్ సోకుతున్న వారిలో దాదాపు 81 శాతం మందిలో ఈ వైరస్ సంక్రమించినట్లు వారికి కూడా తెలియదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇలాంటివారిలో కరోన ల‌క్షణాలు కూడా కనిపించవని చెప్పారు. ఆదివారం కామారెడ్డి జిల్లాలో ఎంపీ బీబీ పాటిల్ ప్రజలకు అందిస్తున్న కరోనా హోమియో ఇమ్యూనిటీ బూస్టర్ కిట్లను మంత్రి ఈటల ఆవిష్కరించారు. వైరస్ బారిన పడిన వారికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలకు మించదని ఆయ‌న చెప్పారు.
Samayam Telugu ఈటల రాజేందర్
etela rajender


కరోనా ర్యాపిడ్ టెస్టులు చేయడంలో మన దగ్గర కాస్త ఆలస్యం అయిందని మంత్రి అన్నారు. ఐసీఎంఆర్ ఆదేశాల ప్రకారం ర్యాపిడ్ టెస్టుల సంఖ్యను బాగా పెంచామని అన్నారు. లక్షణాలు లేని వారి ద్వారానే కరోనా వ్యాప్తి అధికంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. హోం ఐసోలేషన్‌కు పంపే ముందు ఇంట్లో ఉన్న అందరి వివరాలు పూర్తిగా నమోదు చేసుకోవాలని ఈటల ఆదేశించారు. కామారెడ్డిలో లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి లేదా నిజామాబాద్ ఆస్పత్రికి రిఫర్ చేయాలని సూచించారు. అవసరం ఉన్న చోట ఆక్సిజన్, వెంటిలేటర్ వసతి కల్పిస్తామని చెప్పారు.

మరోవైపు, కరోనా వైరస్‌కు సీజనల్ వ్యాధులు కూడా తోడవుతున్నాయని అన్నారు. ఈ వ్యాధులు ప్రబలడంపై జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నట్లు వివరించారు. ఇక ఈ నెల 31 లోపు ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందికి జీతాలు అందించే ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. మానవాళి ఎదుర్కొంటున్న ఈ సమస్యను కలిసికట్టుగా ఎదుర్కోవాలని, ప్రతిప‌క్షాలు బాధ్యత లేకుండా మాట్లాడ‌డం బాధాక‌ర‌మ‌ని ఈటల అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.