యాప్నగరం

సభలో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రసంగంపై.. ఈటల, ఎర్రబెల్లి సెటైర్లు

మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రసంగించారు. అరగంటకు పైగా ఆయన మాట్లాడటంతో మంత్రులు ఎర్రబెల్లి, ఈటల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Samayam Telugu 10 Sep 2020, 11:53 am
తెలంగాణ అసెంబ్లీప వర్షాకాల సమావేశాలు నాలగవ రోజు ప్రారంభం అయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభలో ప్రశ్నోత్తరాలు.. ముందుగా ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మాట్లాడారు. సభలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆయిల్ ఫామ్ సాగుపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి నిరంజన్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టంలో ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నామ‌న్నారు, సీఎం కేసీఆర్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఈ రంగం ద్వారా వ‌చ్చే ఉపాధి అవ‌కాశాలు, స్థూల ఆదాయంతో తెలంగాణకు ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్ ఉంటుందన్నారు.
Samayam Telugu నిరంజన్ రెడ్డిపై మంత్రుల సెటైర్లు


Read More: మెదక్ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో కొనసాగుతున్న సోదాలు

అయితే మంత్రి నిరంజన్ రెడ్డి దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడంతో సభలో ఇతర మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. ఒక్క ప్రశ్నలకు 40 నిమిషాల పాటు సమాధానమా? అంటూ ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఈటల కూడా 40 నిమిషాల పాటు మాట్లాడితే ఎలా అంటూ సెటైర్లు. దీనికి నిరంజన్ స్పందిస్తూ... ప్రశ్నలు వేసిన వారికి జవాబు రాకపోతే ఎలా? సమాధానం ముఖ్యమా? సమయం ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. దీంతో స్పీకర్ కల్పించుకొని ఇంకా ఐదు ప్రశ్నలు ఉన్నాయన్నారు. దానికి మంత్రి స్పందిస్తూ రెండు నిమిషాల్లోనే ముగిస్తా అన్నారు. ఇంతలో మరో మంత్రి ఈటల ఏదో అనడంతో నువ్వే నిమిషం తీసుకుంటువి అంటూ నిరంజన్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. మొత్తానికి సభలో ఇలా మంత్రులు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడంతో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.

Read More: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా

నిరంజన్ రెడ్డి ప్రసంగం ముగియాగానే.. స్పీకర్ సభ సభ్యుల్ని ఉద్దేశిస్తూ.. నో సీటింగ్ స్థానాల్లో మంత్రులు ఎవరూ కూర్చోవద్దన్నారు. సభలో జీరో అవర్‌ అనంతరం పలు బిల్లులను ప్రవేశపెట్టి సభ ఆమోదించే అవకాశాలున్నాయి. శాసనమండలిలో కరోనాపై చర్చ జరుగనున్నది. ఉదయం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ ఉండనున్నది. శుక్రవారం రెవెన్యూ బిల్లుపై చర్చిస్తారు. రోజంతా సభ జరిగే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.