యాప్నగరం

హైదరాబాద్‌లో కరోనా వైరస్..! మంత్రి ఈటల క్లారిటీ

Coronavirus Hyderabad: తెలంగాణలో కరోనా వైరస్‌పై పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంయమనం పాటించాలని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినవారికి వైద్యపరీక్షలు నిర్వహించడం ఆలస్యమవుతుండడంతో.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోనే వైద్యపరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 7 Feb 2020, 12:47 pm
హైదరాబాద్‌లో కరోనా వైరస్ తొలి కేసు నమోదయిందా? అనే అంశంపై ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ స్పష్టత ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైరస్ నిర్ధారణ పరీక్షా కేంద్రంలో ఇప్పటివరకు ఏ రోగికీ వైరస్ సోకినట్లు తేలలేదని వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు.
Samayam Telugu etela rajender


Also Read: మేడారం: వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు

తెలంగాణలో కరోనా వైరస్‌పై పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంయమనం పాటించాలని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినవారికి వైద్యపరీక్షలు నిర్వహించడం ఆలస్యమవుతుండడంతో.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోనే వైద్యపరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం నుంచి ఇక్కడే వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు చేసేందుకు అనుమతులు లేవు.

Also Read: సిద్దిపేటలో ఏకే-47తో కాల్పుల కలకలం.. ఉలిక్కిపడ్డ గ్రామస్థులు

ఈ నేపథ్యంలో పేరొందిన ఓ కార్పొరేటు పిల్లల ఆస్పత్రి తమ వద్ద ఉన్న ఓ ఆరు నెలల చిన్నారికి వైరస్ సోకిందని గాంధీ ఆస్పత్రికి లేఖ రాసినట్లుగా కొన్ని వార్తా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. చిన్నారికి సాధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా, కరోనా సోకిన విషయం తేలిందని ఆ ఆస్పత్రి లేఖలో వెల్లడించినట్లు వివరించాయి. ఆ ప్రైవేటు ఆస్పత్రి తీరుపై గాంధీ వైద్యులు అసహనం వ్యక్తం చేశారని పేర్కొన్నాయి. ఇది సున్నితమైన అంశం అయినందున కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం ఒక గాంధీ ఆస్పత్రికే అనుమతి ఇచ్చిందని వివరించాయి.

Also Read: తెలంగాణ బిల్లు విషయంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోండి: మోదీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.