యాప్నగరం

గాంధీ వైద్యుడిపై దాడి: వాళ్లని ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోం.. మంత్రి ఈటల

Coronavirus Deaths in Hyderabad: బుధవారం గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి చనిపోయిన అనంతరం అతని కుటుంబ సభ్యులు వైద్యులపై దాడి చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు.

Samayam Telugu 1 Apr 2020, 10:22 pm
గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడి వ్యవహారాన్ని మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిల్లోనూ క్షమించబోమని తేల్చి చెప్పారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏంటని ప్రశ్నించారు. డాక్టర్ల మీద దాడి చేయడం హేయమైన చర్య అని.. ఇలాంటి గంభీరమైన సమయంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. 24 గంటలు డాక్టర్లు ప్రజల కోసం పని చేస్తున్నారని.. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రతి డాక్టర్‌కూ రక్షణ కల్పిస్తామని చెప్పారు. వైద్యులు భరోసాతో పని చేయాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని బుధవారం రాత్రి మంత్రి ఈటల ఓ ప్రకటనలో తెలిపారు.
Samayam Telugu etela rajender


మరోవైపు, ఈ ఘటనను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఖండించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో తమ ప్రాణాలు లెక్క చేయకుండా వైద్యులు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తుంటే ఇలాంటి దాడులు చేయడం సరికాదని అన్నారు.

బుధవారం గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి చనిపోయిన అనంతరం అతని కుటుంబ సభ్యులు వైద్యులపై దాడి చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. రోగి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించిన తర్వాత అదే వార్డులో చికిత్స పొందుతున్న అతని బంధువులు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని శ్రవణ్ కుమార్ వెల్లడించారు.

Must Read: లాక్ డౌన్‌పై తెలంగాణ పోలీసుల పోల్.. షాకింగ్ వాస్తవాలు

ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో పాటు స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని శ్రవణ్ వివరించారు. హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్‌ వచ్చిన తర్వాతే పోలీసులు స్పందించారని శ్రవణ్ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు వైద్యులపై దాడి చేయడం సరికాదని, ఈ ఘటనను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

Also Read: తెలంగాణలో మరో కరోనా మృతి.. గాంధీ వైద్యులపై దాడి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.