యాప్నగరం

కరోనా కలకలం: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మంత్రి ఈటల తనిఖీలు

Shamshabad Airport: ‘‘ఎయిర్‌పోర్టులో నాలుగు ప్రధానదారులు ఉండగా.. వాటి దగ్గర డాక్టర్లు, నర్సులు, హెల్పర్లు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తిని స్కానింగ్ చేస్తారు. ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే ప్రత్యేకమైన గదిలోకి తీసుకెళ్ళి, ‌మాస్కులు వేసి గాంధీ ఆసుపత్రికి తరలిస్తారు”

Samayam Telugu 9 Mar 2020, 11:39 pm
హైదరాబాద్‌లోకి కరోనా వైరస్ ప్రవేశించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, అరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేకంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులోని స్క్రీనింగ్ పరికరాలను మంత్రి ఈటల పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రజలను వణికిస్తుండగంతో దాని ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని స్కానింగ్ చేయాలని అక్కడి అధికారులతో అన్నారు.
Samayam Telugu Capture


హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు రోజూ 550 మంది వరకూ విదేశాల నుంచి వస్తుంటారు కాబట్టి వారికి కరోనా స్కానింగ్ పరీక్షలు చెయ్యడం తప్పనిసరని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘ఎయిర్‌పోర్టులో నాలుగు ప్రధానదారులు ఉండగా.. వాటి దగ్గర డాక్టర్లు, నర్సులు, హెల్పర్లు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తిని స్కానింగ్ చేస్తారు. ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే ప్రత్యేకమైన గదిలోకి తీసుకెళ్ళి, ‌అతనికి పూర్తిగా మాస్కులు వేసి వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలిస్తారు” అని మంత్రి అన్నారు.

Also Read: మారుతీరావు పోస్టుమార్టం నివేదిక.. సంచలన అంశాలు గుర్తించిన వైద్యులు

గతంలో కేవలం కొన్ని నిర్దేశిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే పరీక్షలు నిర్వహించేవాళ్లమని, ఇప్పుడు అన్ని దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని స్క్రీనింగ్ చేస్తున్నామని ఈటల అన్నారు. ఒక్క ప్రయాణికుడు కూడా తప్పిపోకుండా అందరినీ స్కానింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

Must Read: మారుతీరావు ఆత్మహత్యకు అసలు కారణమదే.. వ్యక్తిగత లాయర్ కీలక విషయాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.