యాప్నగరం

కేసీఆర్ హామీలిస్తుంటే.. నా గుండె వేగం పెరిగిపోయింది : హరీశ్ రావు

Harish Rao: ఆర్థికరంగం మంచి ప్రగతి కనబర్చేందుకు సీఎఫ్‌వోలు, పారిశ్రామికవేత్తలు సూచనలు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు కోరారు. ఐదేళ్లుగా ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అవార్డులు అందుకుంటోందని మంత్రి అన్నారు.

Samayam Telugu 5 Dec 2019, 3:07 pm
తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తున్నాయని ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ఈ క్రమంలో ఐదేళ్లుగా ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో పురస్కారాలు అందుకుంటోందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో ఎడిషన్ సీఎఫ్‌వోల సదస్సు-2019 జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా హరీశ్ రావు హాజరై మాట్లాడారు. ఆర్థికరంగం మెరుగుపడేందుకు సీఎఫ్‌వోలు, పారిశ్రామికవేత్తలు సూచనలు ఇవ్వాలని హరీశ్ రావు కోరారు.
Samayam Telugu Harishrao


Also Read: తెలంగాణలో Zero FIR.. మహిళలకు పెప్పర్ స్ప్రే.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు

‘‘దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి ఇంకా కోలుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులపై అంతా అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. ప్రభుత్వంలో నా పాత్ర కూడా సీఎఫ్‌వో (ముఖ్య ఆర్థికాధికారి) పాత్రే. ఈ స్థానం మనిషి శరీరంలో గుండె లాంటిది. ఆర్థికశాఖ మంత్రిగా నిధులు సేకరించి ఖర్చు చేయడమే కాదు. అందుకు విభిన్నంగా వ్యవహారం ఉంటుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీలు ఇచ్చినప్పుడు నా గుండె బాగా వేగంగా కొట్టుకుంది. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ మంచి ప్రగతి సాధిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం తొలి స్థానంలో ఉంది.’’

Also Read: ‘దిశ’ కేసు విచారణకు 12 మందితో సిట్... నెలరోజుల్లోగా ఛార్జిషీట్

పరిశ్రమలకు రుణాలు ఇచ్చేందుకు తొలిసారి బ్యాంకులు మేళాలు నిర్వహిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఆసరా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు.

Also Read: KCR బొమ్మల వల్ల బాగా ఫీలయ్యాం.. మన దేవుడు శాంత మూర్తే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.