యాప్నగరం

సివిల్స్‌‌లో సిద్దిపేట వ్యక్తికి 110వ ర్యాంకు.. హరీష్ రావు అభినందనలు

Siddipet: సివిల్స్ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించిన సిద్దిపేట బిడ్డ మంద మకరంద్‌కు హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ హరీష్ రావు ట్వీట్ చేశారు. తెలంగాణ ఖ్యాతిని మకరంద్ దేశ స్థాయిలో నిలిపారంటూ మకరంద్‌ను అభినందించారు.

Samayam Telugu 4 Aug 2020, 5:19 pm
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-2019 (యూపీఎస్సీ-2019) ఫలితాలు మంగళవారం వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో సిద్దిపేటకు చెందిన మంద మకరంద్ ఆలిండియా స్థాయిలో 110వ ర్యాంకు సాధించాడు. మొత్తం 829 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కాగా, మకరంద్ మంచి ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అతని ప్రతిభపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆనందం వ్యక్తం చేశారు.
Samayam Telugu హరీష్ రావు
Harish Rao4


సివిల్స్ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించిన సిద్దిపేట బిడ్డ మంద మకరంద్‌కు హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ హరీష్ రావు ట్వీట్ చేశారు. తెలంగాణ ఖ్యాతిని మకరంద్ దేశ స్థాయిలో నిలిపారంటూ మకరంద్‌ను అభినందించారు. మకరంద్ స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా రావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామం. మకరంద్ తల్లిదండ్రులు నిర్మల, సురేశ్ నాలుగు దశాబ్దాల కిందట సిద్దిపేటలో స్థిరపడ్డారు. వీరిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.