యాప్నగరం

బ్యాట్ పట్టిన హరీశ్ రావు.. క్రీజ్‌లోకి వస్తూనే బౌండరీలు

Siddipet: హరీశ్‌ రావు నేతృత్వంలోని సిద్దిపేట జట్టు బ్యాటింగ్‌కు దిగింది. హరీశ్‌ రావు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు సాధించింది. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన మంత్రి 12 బంతుల్లో 3 ఫోర్లు కొట్టారు.

Samayam Telugu 3 Dec 2020, 3:13 pm
రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన మంత్రి హరీశ్ రావు.. కాస్త ఆటవిడుపుగా బ్యాట్ పట్టారు. క్రికెట్ ఆడి సిద్దిపేట వాసులను అలరించారు. సిద్దిపేటలోని మినీ స్టేడియంలో బుధవారం రాత్రి టీ 20 ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్‌ మెడికవర్‌ హాస్పిటల్ మధ్య మ్యాచ్ జరిగింది. డాక్టర్ల జట్టుకు కృష్ణ కిరణ్‌ సారథ్యం వహించగా.. సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ కెప్టెన్‌గా మంత్రి హరీశ్ రావు వ్యవహరించారు.
Samayam Telugu క్రికెట్ ఆడుతున్న హరీశ్ రావు
harish rao plays cricket


టాస్ గెలిచిన హైదరాబాద్‌ జట్టు తొలుత బౌలింగ్‌ను ఎంచుకుంది. హరీశ్‌ రావు నేతృత్వంలోని సిద్దిపేట జట్టు బ్యాటింగ్‌కు దిగింది. హరీశ్‌ రావు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు సాధించింది. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన మంత్రి 12 బంతుల్లో 3 ఫోర్లు కొట్టారు. మొత్తం 18 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత ఓవర్‌లో అవుటయ్యారు. చివరికి ఈ మ్యాచ్‌లో హరీశ్‌ రావు జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

నిన్న, మొన్నటిదాకా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన మంత్రి హరీశ్ రావుకు కాస్త ఖాళీ దొరకడంతో క్రికెట్ ఆడారు. బుధవారం రాత్రి సిద్దిపేటలో ఆటవిడుపుగా టీ20 క్రికెట్‌లో మంత్రి కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మంత్రి క్రీజులోకి వస్తూనే రెండు వరుస బౌండరీలు బాది అందరినీ ఆకట్టుకున్నారు. మైదానంలో ప్రొఫెషనల్ క్రికెటర్‌లా బ్యాటింగ్ చేసి మంత్రి అందర్నీ ఆకట్టుకున్నారు.

Must See: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.