యాప్నగరం

Telangana: ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలోనే ప్రమోషన్స్

Teachers: తెలంగాణలోని ఉపాధ్యాయులకు త్వరలో ప్రమోషన్స్, బదిలీలు కల్పించనున్నట్లు మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని.. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు చెప్పారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 14 Jan 2023, 6:28 am

ప్రధానాంశాలు:

  • ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్
  • త్వరలోనే ప్రమోషన్స్, బదిలీలు
  • షెడ్యూల్ విడుదల చేస్తామన్న మంత్రి హరీశ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu teachers promotions
త్వరలోనే టీచర్లకు ప్రమోషన్
Teachers: తెలంగాణలోని ఉపాధ్యాయులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి సంక్రాతి కానుక ఇవ్వనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. ఉపాధ్యాయులందరికీ బదిలీలు, పదోన్నతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈ విషయంపై అడగ్గా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. త్వరలోనే బదిలీలు, షెడ్యూలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
శుక్రవారం పీఆర్‌టీయూటీఎస్ నూతన సంవత్సర డైరీనీ ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా వారికి అన్ని రకాలుగా ఉద్యోగ భద్రత కల్పిచటంతో పాటు మెురగైన జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే నిరుద్యోగుల కోసం ఇప్పటికే ఉద్యోగ ప్రకటనలు విడుదల చేశామని చెప్పారు.

సర్కార్ నిర్ణయంతో ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తు్న్న బదిలీలు, పదోన్నతుల కల నెలవేరనుంది. సీనియార్టీ పరంగా ఉపాధ్యాయులు పదోన్నతలు పొందనున్నారు. మరో వైపు ఏళ్లుగా ఒకేచోట పని చేసున్న ఉపాధ్యాయులు తమకు నచ్చిన చోటుకు బదిలీ ఆప్షన్ ఎంపిక చేకుకోనున్నారు. పీఆర్‌టీయూసీ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమాలాకర్ రావు, ఎమ్మెల్యే కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మె్ల్సీ పూల రవీందర్ తదితరలు పాల్గొన్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.