యాప్నగరం

వలస పక్షుల దినోత్సవానికి ముడిపెట్టి అమిత్ షా టూర్‌పై హరీశ్ రావు సెటైర్

Amit Shah: వలస పక్షులు వస్తుంటాయి. పోతుంటాయి. ఇష్టమైన ప్రదేశాలు తిరిగి, ఆహారాన్ని ఆస్వాదించి, గుడ్లు పెట్టి వెళ్తాయి అంటూ ఆర్థిక మంత్రి హరీశ్ రావు సెటైరికల్ ట్వీట్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 14 May 2022, 11:04 pm
ప్రపంచ వలస పక్షుల దినోత్సవం (World Migratory Bird Day) వేళ మంత్రి హరీశ్‌ రావు చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా.. తెలంగాణ పర్యటనపై ఆయన సెటైరికల్‌గా స్పందించడమే అందుక్కారణం. ‘వలస పక్షులు వస్తుంటాయి, పోతుంటాయి. ఇష్టమైన ప్రదేశాలు తిరిగి, ఆహారం ఆస్వాదించి, గుడ్లు పెట్టి ఆనందంగా తిరిగివెళ్తాయి. నేడు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం కావడం యాదృచ్ఛికం’ అని హరీశ్‌ రావు తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు చేశారు. దీనికి పక్షులు ఎగురుతూ వెళ్తు్న్న ఫొటోను జతచేసి, #AmitShahVisitsTelangana హ్యాష్‌ ట్యాగ్‌ను యాడ్ చేశారు.
Samayam Telugu Photo: Twitter - Modified
Harish Rao Tweet on Amit Shah Telangna Tour


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమిత్ షా రాకకు ముందే ఆయన పర్యటనను ఉద్దేశిస్తూ హరీశ్‌ రావు వ్యంగ్యంగా ఈ ట్వీట్‌ చేశారు.

హరీశ్ రావు చేసిన ట్వీట్‌కు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ‘థ్యాంక్యూ హరీశ్ రావుజీ #AmitShahVisitsTelangana ట్విట్టర్ ట్రెండింగ్‌లో మీరూ పాల్గొన్నందుకు’ అని ఆమె ట్వీట్ చేశారు.

Also Read: హైదరాబాద్ నుంచి నిజాంను తొలగించాలి.. అర్థమైందా నేనేం చెప్తున్నానో: అమిత్ షా
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.