యాప్నగరం

జాతీయ జెండా ఎగరేసిన కేటీఆర్.. నెటిజన్ల స్పందన ఇలా..

Telangana Liberation Day సందర్భంగా మంత్రి కేటీఆర్ జాతీయ జెండా ఎగరేశారు. తెలంగాణ భవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన ఆయన అమరుల త్యాగాలను స్మరించుకుందాం అని ట్వీట్ చేశారు.

Samayam Telugu 17 Sep 2019, 10:21 am
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగరేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ ఫొటోను ట్వీట్ చేసిన ఆయన.. ‘‘హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయిన నేడు. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం. జై తెలంగాణ, జై హింద్’’ అని ట్వీట్ చేశారు. తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Samayam Telugu ktr flag


మంత్రి ట్వీట్‌ పట్ల టీఆర్ఎస్ అభిమానులు సానుకూలంగా స్పందిస్తుండగా.. బీజేపీ సానుభూతిపరుల రెస్పాన్స్ మాత్రం మరోలా ఉంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని 2010లో నాటి సర్కారుకు కేసీఆర్ చేసిన డిమాండ్‌ను గుర్తు చేస్తున్నారు.

Read Also: తెలంగాణ విమోచన దినోత్సవం.. ప్రాధాన్యం
సెప్టెంబర్ 17ను తెలంగాన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కొందరు సూచిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే భావితరాలకు సెప్టెంబర్ 17 ప్రాధాన్యం తెలుస్తుందని ట్వీట్లు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.