యాప్నగరం

తెలంగాణ ప్రజలకు దసరా కానుక.. డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్

జియాగూడలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు కేటీఆర్. పేదలందరికీ ఇళ్లను కేటాయిస్తామన్నారు.

Samayam Telugu 26 Oct 2020, 12:50 pm
డబుల బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దసరా సందర్భంగా పేదల కోసం ప్రభుత్వం కానుకగా ఈ ఇళ్ల ప్రారంభోత్సవం చేసింది. హైదరాబాద్‌లోని జియాగూడలో 2 పడక గదుల డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రి కేటీఆర్‌కు బోనాలతో స్వాగతం పలికారు. ఈ కాలనీలో 840 రెండు పడక గదుల నివాసాలను ప్రభుత్వం నిర్మించింది. తొలి ప్రాధాన్యతగా 568 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.
Samayam Telugu డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
ktr double bed room house


పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు జరుపుకొన్నామన్నారు మంత్రి కేటీఆర్. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు సామెత చెబుతుంటారు. ఈ రెండు పనులు చేయడమంటే కష్టంతో కూడుకున్న పని. కానీ ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తా అని అన్నది ఏకైక మంత్రి కేసీఆర్ అంటూ కొనియాడారు కేటీఆర్. హైదరాబాద్‌లో లక్ష 2 పడకగదుల ఇళ్లను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. నిరుపేదలకు దశలవారీగా ఇళ్లను కేటాయిస్తామని అన్నారు.

Read More: దసరా రోజున.. మహిళా సర్పంచ్‌పై దాడి

జియాగూడ డిగ్నిటీ కాలనీలో బస్తీ దవాఖానాకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రూ.18 వేల కోట్లతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. పైరవీలకు తావులేకుండా ఇళ్ల కేటాయింపు జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుల్లో నాయకులు జోక్యం చేసుకోవద్దన్నారు. మూసీ సుందరీకరణను కూడా త్వరలోనే చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలోమేయర్‌ బొంతురామ్మోహన్‌, హోం మంత్రి మహమూద్‌ అలీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో పాటు పలువురు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.