యాప్నగరం

దుబ్బాక ఫలితం: ఇది మాకో హెచ్చరిక.. ఇక అప్రమత్తంగా ఉంటాం: కేటీఆర్

Telangna Bhavan: ఒక రకంగా ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు తమకు, తమ పార్టీ నేతలకు ఓ హెచ్చరిక లాంటిదని కేటీఆర్ అన్నారు. తప్పకుండా ఈ తీర్పును సమీక్షించుకుంటామని అన్నారు.

Samayam Telugu 10 Nov 2020, 4:19 pm
హోరాహోరీగా దుబ్బాక స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. దుబ్బాక ఎన్నిక ఫలితాలు విడుదలైన వెంటనే తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఫలితం తాము ఆశించిన విధంగా రాలేదని అన్నారు. ఆ స్థానంలో ప్రజలు ఇచ్చిన తీర్పే తమకు శిరోధార్యం అని అన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకారం తమ పని తాము చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పారు.
Samayam Telugu కేటీఆర్
minister ktr


ఒక రకంగా ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు తమకు, తమ పార్టీ నేతలకు ఓ హెచ్చరిక లాంటిదని అన్నారు. తప్పకుండా ఈ తీర్పును సమీక్షించుకుంటామని అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్‌కు ఓటు వేసిన 60 వేల పైచిలుకు ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

‘‘ఈ ఆరేళ్లలో ఎన్నో విజయాలను మేం గెల్చుకున్నాం. ఇప్పుడు ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. ఈ ఓటమి మా పార్టీ నేతలకు ఓ అప్రమత్తత లాంటిది. మేం ఏం తప్పులు చేశామో కూర్చొని సమీక్షించుకుంటాం. ఈ తీర్పును తప్పకుండా సమీక్షించుకుంటాం. పార్టీ గెలుపుకోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు. ఎప్పుడూ విజయాలకు గర్వపడం. అపజయాలకు కుంగిపోము.’’ అని కేటీఆర్ అన్నారు.

1,470 ఓట్ల మెజారిటీ
ఎంతో వేడి పుట్టించిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎట్టకేలకు బీజేపీ విజయం సాధించింది. బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా టీఆర్ఎస్‌ గెలుస్తుందని అంతా ఆశించారు. కానీ, ఫలితం తారుమారైంది. ఉత్కంఠగా సాగిన పోరులో టీఆర్ఎస్ అభ్యర్థిపై 1068 ఓట్ల మెజారిటీతో రఘునందన్ రావు గెలుపొందారు. బీజేపీకి 62,772.. టీఆర్ఎస్‌కు 61,302, కాంగ్రెస్‌కు 21,819 ఓట్లు దక్కాయి. టీఆర్ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ రావు 1,470 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
రౌండ్ల వారీగా పోలైన ఓట్ల పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

Also Read: undefined

Also Read: Dubbaka Results: హరీష్ రావుకు ఊహించని భారీ షాక్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.