యాప్నగరం

బావా.. నాకు తెలుసు నువ్వు త్వరగానే కోలుకుంటావ్.. కేటీఆర్ ట్వీట్

KTR: హరీశ్ రావు త్వరగా కోలుకోవాలని పలువురు ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. ఈ క్రమంలో హరీశ్ రావు ట్వీట్‌పై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.

Samayam Telugu 5 Sep 2020, 2:52 pm
ఆర్థికమంత్రి హరీశ్ రావుకు కరోనా సంక్రమించిన సంగతి తెలిసిందే. శనివారం ట్విటర్ వేదికగా ఆయన స్వయంగా ఈ విషయం ప్రకటించారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని హోం క్వారంటైన్‌లో ఉండాలని ట్వీట్‌లో సూచించారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. ఈ క్రమంలో హరీశ్ రావు ట్వీట్‌పై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్‌కు స్పందించారు.
Samayam Telugu కవిత, హరీశ్ రావు, కేటీఆర్ (ఫైల్ ఫోటోలు)
kavitha harish ktr


‘బావా తొందరగా కోలుకో.. నువ్వు ఇతరులకంటే త్వరగా కోలుకుంటావనే నమ్మకం నాకుంది’ అంటూ ట్వీట్ చేశారు. మంత్రి హరీశ్ కోలుకోవాలంటూ కేటీఆర్ వరస పెట్టి ఇలా ట్వీట్ చేయడం బావాబావమరుదుల అనుబంధానికి అద్దం పట్టింది.


Must Read: ఏడేళ్ల క్రితం దాచుకున్న వీర్యంతో ఇప్పుడు పండంటి బిడ్డ.. హైదరాబాద్‌లో అరుదైన ఘటన

అంతేకాక, టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ కవిత కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. ‘బావా .. మా ప్రార్థనలన్నీ మీ కోసమే. మీ సంకల్ప బలంతో కరోనాను ఓడించాలి’ అని ట్వీట్ చేశారు.


సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఆ పరీక్షల్లోనే మంత్రి హరీశ్‌కు పాజిటివ్‌గా తేలింది.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.