యాప్నగరం

మున్సిపల్ సిబ్బంది భర్తీ: కేటీఆర్ ముమ్మర కసరత్తు.. కీలక ఆదేశాలు

Telangana Municipal Department: ఇంజనీరింగ్, ఇన్ ఫ్రా విభాగాలకు ప్రాధాన్యత కల్పించాలని కేటీఆర్ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తి మేరకు ప్రజలకు పాలన ప్రతి ఫలాలు అందాలని కేటీఆర్ అన్నారు.

Samayam Telugu 14 Jul 2020, 7:32 pm
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఈ అంశంపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి మార్పు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పెరుగుతున్న పట్టణీకరణ, పట్టణాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మున్సిపల్ సిబ్బంది కేటాయింపు, భర్తీ ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని రేషనలైజ్ చేసిన తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని అధికారులకు మంత్రి కేటీఆర్ నిర్దేశించారు.
Samayam Telugu సమీక్షలో కేటీఆర్
KTR


ఇంజనీరింగ్, ఇన్ ఫ్రా విభాగాలకు ప్రాధాన్యత కల్పించాలని కేటీఆర్ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తి మేరకు ప్రజలకు పాలన ప్రతి ఫలాలు అందాలని కేటీఆర్ అన్నారు. కొత్త పురపాలక చట్టం నియమ నిబంధనల మేరకు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలనను అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లో సిబ్బంది అవసరం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఇలా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.