యాప్నగరం

కరోనా తగ్గేలా లేదు.. సహజీవనం తప్పదేమో.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Coronavirus Lockdown: హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పురపాలక శాఖపై మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Samayam Telugu 9 May 2020, 2:30 pm
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. పట్టణాల్లో సరి, బేసి విధానంలో దుకాణాల నిర్వహణను పర్యవేక్షించాలని చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేదని, వ్యాక్సిన్‌ వచ్చేవరకు కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి తప్పేలా లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దశలవారీగా లాక్‌ డౌన్‌ ఎత్తేసినా తర్వాత కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశమే ఎక్కువగా ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడికి అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్య, పురపాలకశాఖలు శనివారం విడుదల చేస్తాయని వెల్లడించారు. మాస్కుల వినియోగం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ల వినియోగాన్ని యథాతథంగా కొనసాగించాలని సూచించారు.
Samayam Telugu KTR


హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పురపాలక శాఖపై మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్‌ కమిషనర్లను మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో కరోనా కట్టడికి భవిష్యత్తులోనూ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ భేటీలో మాన్సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌పైనా మంత్రి సమీక్ష జరిపారు.

సీజనల్‌ వ్యాధుల క్యాలెండర్‌ ఆధారంగా వాటి నిరోధక చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వానాకాలంలో వచ్చే డెంగీ లాంటి వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు. యాంటీ లార్వా యాక్టివిటీస్‌ కార్యక్రమాన్ని తక్షణం ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి పట్టణంలో మురుగు కాల్వలను శుభ్రంచేసి చెత్తను తరలించాలని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. రూ.830 కోట్ల పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన పనులపై నివేదిక పంపాల్సిందిగా కమిషనర్లను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.