యాప్నగరం

కేసీఆర్ వల్లే జనగామ జిల్లా అయింది.. ఆకస్మిక పర్యటనలో కేటీఆర్

Pattana Pragati: ప్రతి ఇంటికి తడి, పొడి చెత్తను సేకరించేందుకు రెండు బుట్టలు ఇచ్చారని.. చెత్తను వేర్వేరుగా సేకరించిన తర్వాత డంపింగ్‌ యార్డుల్లో రెండు రకాల కార్యక్రమాలు చేపడతామని మంత్రి వెల్లడించారు.

Samayam Telugu 26 Feb 2020, 3:58 pm
జనగామ సీఎం కేసీఆర్‌ వల్లే జిల్లా అయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల వద్దకే పాలన తెచ్చామని చెప్పారు. రాబోయే రెండు నెలల్లో జనగామలో 100 మరుగుదొడ్లను నిర్మించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జనగామలోని ధర్మకంచ బస్తీలో కేటీఆర్‌ ఆకస్మికంగా పర్యటించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. అన్ని పట్టణాల్లో పచ్చదనం - పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్ అధికారులకు సూచించారు.
Samayam Telugu ERsOJSBU4AEoGEd.


Also Read: పరిగెడుతూ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు.. మూడు రోజుల్లోనే పూర్తి!

వార్డు కమిటీలు పారిశుద్ధ్య ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్తను సేకరించేందుకు రెండు బుట్టలు ఇచ్చారని.. చెత్తను వేర్వేరుగా సేకరించిన తర్వాత డంపింగ్‌ యార్డుల్లో రెండు రకాల కార్యక్రమాలు చేపడతామని మంత్రి వెల్లడించారు. ‘‘తడి చెత్తతో ఎరువులు తయారు చేసి జనగామ పట్టణ ప్రజలకు అందిస్తాం. తడి, పొడి చెత్త సేకరణకు రిక్షాల్లో కూడా వేర్వేరుగా డబ్బాలు ఏర్పాటు చేయాలి’’ అని కేటీఆర్‌ ఆదేశించారు.

Also Read: దిల్లీ అల్లర్లు: ప్రజలకు హైదరాబాద్ సీపీ కీలక సూచనలుMust Read: కేటీఆర్‌ అంటే అందుకే నాకిష్టం.. కేసీఆర్‌పైనా ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు

పిల్లల భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు కావాల్సిన మొక్కలను నర్సరీల ద్వారా అందజేస్తామన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తామని చెప్పారు. ఆరు నెలల్లో విద్యుత్‌ స్తంభాలు, వేలాడే వైర్ల సమస్యలను పరిష్కరించాలి. బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్‌ మాత్రమే అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని కేటీఆర్‌ చెప్పారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్‌ వెంట స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు కూడా ఉన్నారు.
Also Read:



Must Read: మెట్రో పాసులుంటాయా? ఉండవా? తేల్చిచెప్పిన హెచ్ఎంఆర్ ఎండీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.