యాప్నగరం

ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ప్రశంసలు!

ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ రాసిన ‘అమృత ధారలు’ పుస్తకాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రచయితపై ప్రశంసలు గుప్పించారు.

Samayam Telugu 30 Dec 2019, 1:50 pm
మంగళ హృదయంతో చేసే ప్రతి భగవత్కార్యం విజయం సాధించి.. జైత్రయాత్రలో ప్రయాణిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రముఖ రచయిత, శ్రీశైలం దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ రచించిన 'అమృతధారలు' గ్రంథాన్ని ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని త్యాగరాయ గాన సభలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. "ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న అపూర్వ రచనా, ప్రచురణల ఆధ్యాత్మిక భావజాల కృషి అప్రతిహతంగా సాగుతూ దేశంలోనే అగ్రస్థానానికి చేరుతుండటం తిరుమల శ్రీవారి అనుగ్రహమేనన్నారు.
Samayam Telugu amrutha dhara


పరమ రహస్యమైన పరమాత్మ పరతత్యాలను తెలుగులో అందించడంలో పురాణపండ శ్రీనివాస్ విలక్షణత చాలా ఆకర్షణీయంగా ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా వీఎస్.జనార్దన్ మూర్తి మాట్లాడుతూ తెలుగు నాట భక్తి ప్రచురణలు, రచనలలో పవిత్ర సొగసును ప్రదర్శించే పురాణపండ శ్రీనివాస్ నిస్వార్థతను అభినందించారు. అమృతధార తొలి ప్రతిని విఖ్యాత చారిత్రక నవలా రచయిత ముదిగొండ శివప్రసాద్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆకృతి సుధాకర్, వైఎస్.రామకృష్ణ, కె.రామచంద్రమూర్తి, నగరప్రముఖులు బండి శ్రీనివాసరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.