యాప్నగరం

కేసీఆర్ అన్న మాటలు తూటాల్లా తగిలాయి: మంత్రి పువ్వాడ అజయ్

దిశ ఎన్‌కౌంటర్ జరిగాక శుక్రవారం ఉదయం ఖమ్మంలో పువ్వాడ మీడియాతో మాట్లాడారు. ఆడ వాళ్లను కన్నెత్తి చూస్తే కళ్లు పీకేస్తామనే కేసీఆర్ మాటలు తూటాల్లా తగిలాయని అభివర్ణించారు. ఈ ఘటన నేపథ్యంలో తాను పోలీస్ కానందుకు బాధపడుతున్నానని అన్నారు.

Samayam Telugu 6 Dec 2019, 1:48 pm
దిశపై అత్యాచారానికి పాల్పడి, హత్యకు పాల్పడ్డ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో ఆమె ఆత్మ శాంతిస్తుందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆడ వాళ్లను కన్నెత్తి చూస్తే కళ్లు పీకేస్తామనే కేసీఆర్ మాటలు తూటాల్లా అలాంటివారికి తగిలాయని అభివర్ణించారు. ఈ ఘటన నేపథ్యంలో తాను పోలీస్ కానందుకు బాధపడుతున్నానని అన్నారు. దిశకు సత్వర న్యాయం జరగడంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం పేరు ప్రతిధ్వనించిందని అజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
Samayam Telugu Puvvada


Also Read: అమ్మాయి మీద చెయ్యి వెయ్యాలంటే ఉ..పోయాలి.. కేసీఆర్ వీడియో వైరల్

గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల భద్రత గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడిపోవాలని ఆయన చేసిన వ్యాఖ్యల్ని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. కేసీఆర్ గతంలో చెప్పిన మాటను చేసి చూపించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: స్పాట్‌లోనే మృత దేహాలకు పోస్ట్‌మార్టం.. ఆర్డీవో సమక్షంలో ఏర్పాట్లు

మరోవైపు, ఎన్‌కౌంటర్ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌పై అభిమానంతో హైదరాబాద్‌లో కొందరు పాలాభిషేకం చేశారు. దిశ కుటుంబానికి సరైన న్యాయం చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దేశమంతా సీపీ సజ్జనార్ పేరే మార్మోగుతుంది. సామాజిక మాధ్యమాల్లో సజ్జనార్ పేరు ట్రెండింగ్‌లో ఉంది.

Also Read: దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సీపీ సజ్జనార్‌కు పాలాభిషేకాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.