యాప్నగరం

చెరువుకు గండీ వార్తలపై మంత్రి సీరియస్.. ఇసుకు బస్తాలు వేశామని వెల్లడి

Meerpet: చెరువుకు కింద ఉన్న న్యూ బాలాజీనగర్, జనప్రియనగర్, ఎంఎల్‌ఆర్‌కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్‌ ఎస్‌కాలనీ, టీఎస్‌ఆర్‌కాలనీ, అయోధ్యనగర్‌లు ముంపు ప్రాంతాలుగా మారాయి. దీంతో ఈ ప్రాంతాల్లో ఉంటున్నవారు నిత్యం ఆందోళన మధ్య నివసిస్తున్నారు.

Samayam Telugu 20 Oct 2020, 5:17 pm
హైదరాబాద్‌‌లోని మీర్‌పేట చెరువు కట్టకు గండీ పడిందని మీడియాలో వస్తున్న వార్తలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. మీర్ పేట్ చెరువుపై వస్తున్న వార్తలు అవాస్తవమని మంత్రి ఖండించారు. మంగళవారం మీర్ పేట చెరువును మంత్రి సబిత ఇంద్రారెడ్డి, అధికారులు పరిశీలించారు. కట్ట నుంచి నీళ్లు లీకవుతున్న ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసినట్లు మంత్రి వెల్లడించారు.
Samayam Telugu వరద బాధితులను పరామర్శిస్తున్న మంత్రి
sabitha indra reddy


మీర్‌పేట్‌–బడంగ్‌పేట్‌ మధ్య ఉన్న చెరువు మహేశ్వరం నియోజకవర్గంలో ఉంది. ఈ చెరువు విస్తీర్ణంలో చాలా పెద్దది. చెరువు కట్టలకు ఇటీవల గుంతలు తవ్వారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఈ గుంతలు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో మొక్కల కోసం తవ్విన ఈ గుంతల నుంచి గండీ పడి నీరు భారీగా బయటకు పోతోంది. శిఖం భూములు చాలా వరకు కబ్జాకావడం, ఇంటి వ్యర్ధాలను కట్టకు లోపలి వైపు పోయడంతో చెరువు విస్త్రీర్ణం చాలా వరకు కుంచించుకుపోయింది. చిన్న పాటి వర్షానికి చెరువు పొంగిపొర్లుతోంది. ఫలితంగా చెరువుకు కింద ఉన్న న్యూ బాలాజీనగర్, జనప్రియనగర్, ఎంఎల్‌ఆర్‌కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్‌ ఎస్‌కాలనీ, టీఎస్‌ఆర్‌కాలనీ, అయోధ్యనగర్‌లు ముంపు ప్రాంతాలుగా మారాయి. దీంతో ఈ ప్రాంతాల్లో ఉంటున్నవారు నిత్యం ఆందోళన మధ్య నివసిస్తున్నారు.

ఈ క్రమంలో స్థానికంగా ఉన్న న్యూ బాలాజీనగర్‌ కాలనీలో 90 శాతం మంది, జనప్రియ నగర్‌లోని క్వార్టర్లలో 20 శాతం మంది ఇప్పటికే తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ముంపు మరింతగా ఉంటుందేమో అనే భయాందోళనల మధ్య మిగిలిన కాలనీల్లోనూ చాలా వరకు నివాసాలు ఖాళీ అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.