యాప్నగరం

తుపాకీ పేల్చితే.. రాజీనామా చేయాలా?: శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: మహబూబ్​నగర్​లో జరిగిన ఫ్రీడమ్ ర్యాలీలో.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుపాకీతో కాల్పులు జరపడం రచ్చకు దారి తీసింది. దీనిపై మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో మంత్రి వివరణ ఇచ్చారు. అయితే.. దీనిపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 14 Aug 2022, 7:20 pm

ప్రధానాంశాలు:

  • మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన కామెంట్స్
  • తుపాకీ పేల్చితే.. రాజీనామా చేయాలా అని ప్రశ్న
  • మంత్రి తీరుపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Srinivas Goud
శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud: మహబూబ్నగర్లో జరిగిన ఫ్రీడమ్ ర్యాలీలో.. తుపాకీ పేల్చడంపై విపక్షాల ఆరోపణలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుబట్టారు. తుపాకీ పేల్చితే.. రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ఏదైనా ఘటన జరిగితే.. విచారణ అంటూ ఉంటుందని చెప్పారు. దాని ప్రకారం నడుచుకోవాలన్నారు. తాను పేల్చింది రబ్బరు బుల్లెట్ అని మంత్రి మరోసారి వివరణ ఇచ్చారు. తాను పదేపదే చెబుతున్నా.. ప్రతిపక్షాలు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.
మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఏ చట్ట ప్రకారం తుపాకి తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) ప్రశ్నించారు. శ్రీనివాస్‌ గౌడ్‌కు ఏమైనా లైసెన్స్‌ ఉందా అని నిలదీశారు. దీనిపై మాట్లాడేందుకు డీజీపీ ఆఫీసుకు ఎప్పుడు రమ్మంటారని అడిగారు. మంత్రి పేల్చిన తుపాకీని ఫోరెన్సిక్‌ ల్యాబ్కు పంపాలని.. లేకుంటే.. రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఎస్పీ ఒక ప్రైవేట్ వ్యక్తికి తుపాకీ ఇచ్చి కాల్చమని చెప్పే చట్టముందా అని ప్రశ్నించారు. బాధ్యతగల మంత్రి తన గన్మెన్ దగ్గర్నుంచి గన్ తీసుకున్నారని ఆరోపించారు. దాన్ని కప్పి పుచ్చుకోవాడానికి ఎస్పీ తానే ఆ తుపాకీ ఇచ్చాను అని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.