యాప్నగరం

ఏది పడితే అది మాట్లాడొద్దు.. సీఎం కేసీఆర్‌తో పనిచేయటం ఇష్టం లేదని ఎలా అంటారు?: గవర్నర్‌పై తలసాని వ్యాఖ్యలు

గవర్నర్ తమిళిసై చెన్నైలో సీఎం కేసీఆర్, ఇక్కడి అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తాజాగా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్న తలసాని.. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు.

Authored byRaj Kumar | Samayam Telugu 20 Apr 2022, 12:45 pm

ప్రధానాంశాలు:

  • ఉపరాష్ట్రపతి, గవర్నర్ అనే రోల్ అనేవి చాలా తక్కువ
  • గవర్నర్ అన్నీ తెలుసుకొని మాట్లాడాలి
  • తమిళిసై మంత్రి తలసాని విమర్శలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu తమిళి సై, తలసాని
తెలంగాణలో గవర్నర్‌, ప్రభుత్వం మధ్య గ్యాప్‌ మరింత పెరుగుతోంది. గవర్నర్‌ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. ఇటు మంత్రులు గవర్నర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తుండటంతో ఇది మరింత ముదురుతోంది. నిన్న గవర్నర్ తమిళిసై చెన్నైలో సీఎం కేసీఆర్, ఇక్కడి అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తాజాగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్న తలసాని.. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం తమదని.. నామినేటెడ్ వ్యక్తులం కాదని కామెంట్ చేశారు. గవర్నర్‌ రాజకీయ పార్టీల వ్యక్తిలా మాట్లాడటం మంచిది కాదని.. ఈ ముఖ్యమంత్రితో పనిచేయటం ఇష్టం లేదని చెప్పటం సరికాదని హితవు పలికారు.

‘రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించటం సరికాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు మావి.. నామినేటెడ్ వ్యక్తులం కాదు. రాజకీయ పార్టీల వ్యక్తిలా మాట్లాడటం మంచిది కాదు. ఈ ముఖ్యమంత్రితో పనిచేయటం ఇష్టం లేదని చెప్పటం సరికాదు. ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదు..’ అని తలసాని వ్యాఖ్యానించారు. గవర్నర్ రాజకీయ పరమైన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వంపైన ఆరోపణలు సరికాదన్నారు. ‘ఉపరాష్ట్రపతి, గవర్నర్ అనే రోల్ చాలా తక్కువ.. గవర్నర్‌గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి’ అంటూ ఆయన హితవు పలికారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయని అన్నారని తలసాని గుర్తు చేశారు.. అది కూడా గవర్నర్ తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. మరోవైపు రాజ్యాంగ పరమైన విధానంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటని తలసాని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు పనీపాట లేదని ఆయన మండిపడ్డారు. పొద్దున లేస్తే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం తప్ప వేరే పని లేదంటూ తలసాని ఫైర్ అయ్యారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.