యాప్నగరం

చందన్‌వెల్లిలో వెల్‌స్పన్ పరిశ్రమ.. ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, సబిత

KTR: చందనవెళ్లి పారిశ్రామిక పార్క్‌కి అవసరమైన మౌలిక వసతులు, రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు.

Samayam Telugu 25 Jul 2020, 6:01 pm
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో వెల్‌స్పన్‌‌ సంస్థకు చెందిన ఓ ఫ్లోరింగ్ యూనిట్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. చందనవెళ్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. గుజరాత్‌కు చెందిన కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం శుభపరిణామని కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంస్థ రూ.2వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ఇక్కడ సంస్థ నెలకొల్పడం ద్వారా స్ధానిక యువతకు ఉద్యోగాలు కలుగుతాయని తెలిపారు.
Samayam Telugu మాట్లాడుతున్న కేటీఆర్
Welspun Flooring at Chandanvelly


అంతేకాక, ఈ పారిశ్రామిక క్లస్టర్‌లో మరో నాలుగు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. చందనవెళ్లి పారిశ్రామిక పార్క్‌కి అవసరమైన మౌలిక వసతులు, రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. 3,600 ఎకరాల్లో ఇక్కడ పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.

మంత్రి కేటీఆర్‌ చొరవతోనే షాబాద్ మండలంలో పెద్ద సంస్థ ఏర్పాటైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్థానికులు కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు. మంత్రి కేటీఆర్ ఎక్కడికెళ్లినా తెలంగాణకు పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తున్నారని కొనియాడారు. స్థానికులంతా అందరూ దీనిని సొంత కంపెనీగా భావించాలని అన్నారు. రానున్న కాలంలో మరిన్ని సంస్థలు రానుండటంతో వచ్చే 5 ఏళ్ల కాలంలో షాబాద్ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోనూ అతి పెద్ద ఫార్మా సిటీ కంపెనీ ఏర్పాటు జరుగుతుందని మంత్రి సబిత తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.