యాప్నగరం

BJP ఆపరేషన్ ఆకర్ష్.. కమిటీ ఛైర్మన్‌గా ఈటల? అధికారమే లక్ష్యంగా దూకుడు

Telangana BJP | తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీ ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెడుతోంది. మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చేరికల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 5 Jul 2022, 12:29 am
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం కావడంతో.. ఆ ఊపులో తెలంగాణ బీజేపీ దూకుడు కొనసాగిస్తోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ను వేగవంతం చేయాలని కాషాయదళం నిర్ణయించింది. ఈ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించాలని పార్టీ హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Samayam Telugu ఈటల రాజేందర్
Etela Rajender


బీజేపీ సీనియన్ నేత ఇంద్రసేనా రెడ్డి ప్రస్తుతం పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఆయన ఇప్పటికే పలుమార్లు అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. దీంతో ఆ బాధ్యతలను ఈటల రాజేందర్‌కు అప్పగించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. చేరికల కమిటీ కో-ఛైర్మన్‌గా వివేక్ వెంకటస్వామిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా ఈటలకు గుర్తింపు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. పార్టీలకు అతీతంగా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈటలకు కొత్త బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీలో చేరికలు ఎక్కువగా ఉంటాయని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేడు (జులై 5) బండి సంజయ్‌ అధ్యక్షతన పార్టీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌ల భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో చేరికల కమిటీ బాధ్యతలను ఈటల రాజేందర్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.