యాప్నగరం

కేటీఆర్ సీఎం అయితే కవిత షాకింగ్ డెసిషన్.! ఎమ్మెల్యే సీతక్క సంచలనం

హుజూరాబాద్ ఉప ఎన్నికతో రాజకీయ ప్రత్యర్థులు మాటలకు పదునుపెడుతున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలున్నాయని.. కేటీఆర్ కూడా తండ్రి నిర్ణయాలతో అవమానపడ్డారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తాజాగా కేటీఆర్, కవితకి పంచాయితీ నడుస్తోందంటూ ఎమ్మెల్యే సీతక్క షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 25 Aug 2021, 10:25 pm
ఆదివాసీ, గిరిజన బిడ్డలకు అనుక్షణం అందుబాటులో ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క అలియాస్ దనసిరి అనసూయ కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్న సీతక్కని బానిస అంటూ టీఆర్‌ఎస్ నేతలు విమర్శించడంపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను బానిసను కాదని.. దొర తనాన్ని తరిమికొట్టిన కొమరం భీం వారసులమని ఆమె హెచ్చరించారు. తనకు రాజకీయ జీవితమిచ్చిన చంద్రబాబుకి 14 ఏళ్లుగా రాఖీ కడుతున్నానని ఆమె చెప్పారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ktr


మూడుచింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన దీక్షలో మాట్లాడిన ఆమె కేటీఆర్, కవితను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కి, కవితమ్మకి ఈ మధ్యన పంచాయితీ వచ్చిందని.. ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తే ప్రగతి భవన్ ముందే ప్రాణం తీసుకుంటానందట అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకే ఆమె రాఖీ కట్టేందుకు కూడా రాలేదని సీతక్క అన్నారు. అయితే తనపై ట్రోల్ చేయడం ఇదెక్కడి దుర్మార్గం అంటూ ఆమె మండిపడ్డారు.

‘పాపం కేటీఆర్‌కి కవితమ్మకి ఏదో పంచాయితీ అయిందట. కేటీఆర్‌కి ముఖ్యమంత్రి ఇస్తే నేను ప్రగతి భవన్ ముందే నా ప్రాణం తీసుకుంటానని ఆమె రాఖీ కట్టడానికి రాలేదు. దాంతోటి నా మీద ట్రోల్ చేయడం ఎంత దుర్మార్గం రా. ఈ ఒక్క రోజే నేను రాకీ కట్టలే. పదిహేనేళ్లుగా కడుతున్నా’ అంటూ సీతక్క చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.