యాప్నగరం

బిజీలో ఈ పని చేస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది... కవిత స్పెషల్ ట్వీట్

కవిత టీ కప్పుతో దిగిన సెల్ఫీని షేర్ చేశారు. ఇవాళ అంతర్జాతీయ చాయ్ దినోత్సవం సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు కవిత.

Samayam Telugu 15 Dec 2020, 2:31 pm
పొద్దున్న లేవగానే ఓ కప్పు టీ పొట్టలో పడకపోతే.. చాలామందికి రోజు గడవదు. టీ తాగడ ఏమాత్రం ఆలస్యమైన చాలామంది ఉండలేరు. కొందరికీ తలనొప్పి కూడా మొదలయిపోతుంది. అందుకే టీకి అంత ప్రాముఖ్యత ఉంది. టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు కూడా చెబుతుంటారు. బ్రిటీష్ వారు మనకు అంటించిపోయిన ఈ చాయ్ దినోత్సవాన్ని కూడా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Samayam Telugu ఎమ్మెల్సీ కవిత స్పెషల్ ట్వీట్


భారతీయులే కాదు చాలా దేశాల ప్రజలు చాయ్ అలవాటు చేసుకున్నారు. నేడు డిసెంబర్ 15 న ఇంటర్నేషనల్ టీ డే (International Tea Day 2020) సెలబ్రేట్ చేసుకుంటున్నారు. భారత్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మలేషియా, కెన్యా, వియత్నాం, ఇండోనేషియా, ఉగాండా, టాంజానియా సహాలు పలు దేశాలు ప్రతి ఏడాది ఈరోజున అంతర్జాతీయ చాయ్ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. కార్మికులకు మరియు రైతులకు టీ వ్యాపారం వల్ల కలిగే ప్రభావాన్ని అంచనా వేయడానికి ఈ రోజు టీ డేను జరుపుకుంటున్నారు.

Read More: మరో మంత్రికి షాక్.. బీజేపీలో చేరుతున్న సోదరుడు ?

ఈ అంతర్జాతీయ ఛాయ్ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. ''బిజీ షెడ్యూల్ మధ్యలో, కప్పు అల్లం ఛాయ్ తాగితే, మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. టీ తాగుతున్న సెల్ఫీని కూడా ఆమె ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు. మీరు కూడా సైతం టీ తాగుతూ సెల్ఫీ షేర్ చేయాలని నెటిజెన్లను అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా కోరారు కవిత.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.