యాప్నగరం

శ్రీశైలంలో మళ్లీ ప్రమాదం.. ఈసారి మాక్ డ్రిల్, భయంతో సిబ్బంది పరుగులు

శ్రీశైలంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అయితే.. విషయం తెలియని సిబ్బంది భయంతో పరుగులు తీశారు. తీరా అసలు విషయం తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు.

Samayam Telugu 2 Sep 2020, 8:06 pm
ది శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం.. కొన్ని రోజుల కిందట అక్కడ చోటు చేసుకున్న అగ్నిప్రమాదం తీరని విషాదం నింపింది. తొమ్మిది మంది ఉద్యోగులు మరణించారు. ఆ విషాద ఘటన నుంచి సిబ్బంది ఇంకా తేరుకోలేదు. ఇలా ఉండగా.. బుధవారం (సెప్టెంబర్ 2) సాయంత్రం మళ్లీ అదే కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. భారీ శబ్దాలతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సిబ్బందికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. భయంతో పరుగులు తీశారు.
Samayam Telugu శ్రీశైలం మాక్ డ్రిల్
Mock Drill in Srisailam Power plant


ప్రాణాలతో బయటపడ్డామని సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈలోగా అసలు విషయం తెలిసింది. సిబ్బంది అప్రమత్తత పరిశీలన కోసం రహస్యంగా మాక్ డ్రిల్ నిర్వహించారట. అధికారులు ఆ విషయం చెప్పడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంత మంది నవ్వుకున్నారు కూడా.

ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో అవగాహన కల్పించేందుకే మాక్ డ్రిల్ నిర్వహించినట్లు సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. కేవలం డైరెక్టర్లకు మాత్రమే సమాచారం ఉందని, విద్యుత్‌ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి తెలియనివ్వలేదని ఆయన చెప్పారు. అయితే.. అది నిజమైన అగ్నిప్రమాదం అనుకొని సిబ్బంది భయంతో పరుగులు తీశారు.

విశ్రాంత అధికారి అజయ్‌తో కలిసి శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రానికి వెళ్లానని సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ఆగస్టు 20న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోట్లాది రూపాయల నష్టం నుంచి ప్లాంటును కాపాడి.. ఈ ప్రమాదం తొమ్మిది మంది సిబ్బంది వీరమరణం చెందారు. ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ జరుగుతోంది.

Also Read: ఉజ్జయినీ శివలింగాన్ని తాకొద్దు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Must Read: గాలిలో వైరస్‌ను గుర్తించే యంత్రం.. రష్యా మరో ఘనత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.