యాప్నగరం

మరికొద్ది గంటల్లో అతి భారీవర్షం.. మరో మూడ్రోజులు ఈ జిల్లాల్లో కుండపోతే..

Hyderabad Weather: శ‌నివారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌లో గంట పాటు అతి భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. అయితే, జీహెచ్ఎంసీ ప్రకటించిన హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Samayam Telugu 19 Sep 2020, 4:06 pm
శనివారం సాయంత్రానికల్లా హైదరాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. దీంతోపాటు సంబంధిత ఉపగ్రహ ఛాయాచిత్రాన్ని కూడా జత చేసింది. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమ‌త్తమైందని వెల్లడించింది. జీహెచ్ఎంసీలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్నందున న‌గ‌ర ప్రజ‌లంద‌రూ అప్రమ‌త్తంగా ఉండాల‌ని జీహెచ్ఎంసీ సూచించింది. న‌గ‌ర వాసులంతా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 100 కు లేదా 040-21111111 నంబ‌ర్‌కు, డీఆర్ఎఫ్ బృందాల కోసం 040-295555500 నంబ‌ర్‌కు కాల్ చేయాల‌ని ట్వీట్ చేసింది.
Samayam Telugu ఉపగ్రహ చిత్రం (Photo Credit: GHMC/Twitter)
IMD Hyderabad


ఇప్పటికే శ‌నివారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌లో గంట పాటు అతి భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. అయితే, జీహెచ్ఎంసీ ప్రకటించిన హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన 3 రోజుల నుంచి 384 ఫిర్యాదులు అందాయి. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌కు 129, డయల్ 100కు 67, మై జీహెచ్ఎంసీ యాప్‌కు 165, జీహెచ్ఎంసీ వెబ్ సైట్ ద్వారా 23 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వివరించారు.

Also Read: ఇంకెన్ని ప్రాణాలు బలికావాలి సీఎం గారూ.. ఆ లెక్క తీస్తే గిన్నీస్ రికార్డు: విజయశాంతి

వచ్చే 3 రోజులు ఇలా..
ఇదిలా ఉంటే తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం సూచించింది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఆదివారం కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరింత బలపడుతుందని, దీంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

నాగర్ కర్నూల్, వనపర్తి, సిద్దిపేట, జనగామ, వికారాబాద్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో శనివారం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు, సోమవారం ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.