యాప్నగరం

ముగ్గురు పిల్లల చేతులు కట్టేసి చెరువులోకి నెట్టి తల్లి సూసైడ్

Vikarabad: మద్దూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన సత్యప్ప, ఎల్లమ్మ (26) భార్యాభర్తలు. వీరికి రజిత (8) అనిత (6), రాజు (4) అనే ముగ్గురు సంతానం ఉన్నారు.

Samayam Telugu 27 Nov 2020, 7:42 am
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం హుస్నాబాద్‌లో తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లల చేతులను కట్టేసి పిల్లల సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. వీరిలో ఒకే ఒక బాలిక ఎలాగొలా చెరువు నుంచి తప్పించుకొని బతకడం విశేషం. వివరాల్లోకి వెళితే మద్దూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన సత్యప్ప, ఎల్లమ్మ (26) భార్యాభర్తలు. వీరికి రజిత (8) అనిత (6), రాజు (4) అనే ముగ్గురు సంతానం ఉన్నారు.
Samayam Telugu ముగ్గురు పిల్లల చేతులు కట్టేసి చెరువులోకి నెట్టి తల్లి సూసైడ్
mother suicide


గురువారం ఉదయం కుటుంబ పరిస్థితుల దృష్ట్యా భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కలత చెందిన ఎల్లమ్మ తన ముగ్గురు పిల్లలు రాజు, రజిత, అనితతో కలిసి కొడంగల్ మండలం హస్నాపూర్ చెరువు వద్దకు చేరుకుంది. పిల్లలందరికీ చున్నీతో చేతులు కట్టేసింది. పిల్లల్ని చెరువులోకి నెట్టేసి తను కూడా దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో అనిత అనే అమ్మాయి ఎలాగోలా తప్పించుకుని బయటపడింది. కానీ ఎల్లమ్మ, రాజు, రజిత ముగ్గురు చెరువులో పడి చనిపోయారు.

హృదయ విదారకమైన ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల వారిని తీవ్రంగా కలచివేసింది. ముక్కుపచ్చలారని చిన్నారి అనిత ఘటన జరిగిన వివరాలను తెలుపుతూ ఉంటే గుండె తరుక్కుపోయే పరిస్థితి కనిపించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.