యాప్నగరం

కొవిడ్‌లాగే ఈ అంశంలోనూ జోక్యం చేసుకోండి.. గవర్నర్‌కు రేవంత్ లేఖ

Telangana Congress: అగ్ని ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, సీఎం కేసీఆర్ ఆధునిక నియంతగా మారారని రేవంత్ ధ్వజమెత్తారు.

Samayam Telugu 22 Aug 2020, 6:01 pm
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. కోవిడ్ విషయంలో జోక్యం చేసుకున్నట్టుగానే శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాద ఘటన విషయంలోనూ కలగజేసుకోవాలని గవర్నర్‌ను రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం గవర్నర్‌కు ఆయన లేఖ రాశారు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదం పూర్తిగా మానవ నిర్లక్ష్యం వల్లే జరిగిందని, ఇదంతా కుట్ర అని రేవంత్ లేఖలో ఆరోపించారు.
Samayam Telugu రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
revanth reddy


అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని క్షేత్రస్థాయి సిబ్బంది రెండు రోజుల క్రితమే హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ప్రమాదానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యత వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. అలాగే బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాల్సిందిగా సీఎంను ఆదేశించాలని సూచించారు.

అగ్ని ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, సీఎం కేసీఆర్ ఆధునిక నియంతగా మారారని రేవంత్ ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని అన్నారు.

Must Read: undefined

ఆదివారం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రానికి వెళ్తుండగా పోలీసులు అడ్డగించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న రేవంత్‌రెడ్డి, మల్లు రవిని పోలీసులు అడ్డగించారు. ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. పోలీసులతో దీంతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు-కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Must Read: వీడియో: నన్ను 139 మంది దారుణంగా రేప్ చేశారు.. పంజాగుట్టలో మతి పోగొట్టే కేసు నమోదుMust Read: కూతురి న్యూడ్ ఫోటోలు ల్యాప్‌టాప్‌లో: తండ్రి దారుణ అరాచకాలు మరిన్ని వెలుగులోకి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.