యాప్నగరం

వినాయక చవితికి ఎంపీ వినూత్న ప్రయత్నం.. విత్తన గణపతులు పంపిణీ

Hyderabad: విత్తన గణపతి అంటే మట్టితో చేసిన వినాయక విగ్రహం లోపల విత్తనాన్ని ఉంచుతారు. పూజల అనంతరం దీన్ని నేరుగా భూమిలో ఉంచవచ్చు.

Samayam Telugu 5 Aug 2020, 6:23 pm
ప్రకృతి పరిరక్షణ కోసం టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మరో ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఈ వినాయక చవితి పండుగకు పర్యావరణ హితంగా ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆధ్యాత్మికతకు పర్యావరణ రక్షణను జోడించటమే ఈ కార్యక్రమ సంకల్పం అని ఆయన అన్నారు. ఈ సారి వినాయక చవితికి సీడ్ గణేష్‌లను (విత్తన గణపతి) పంపిణీ చేయాలని నిర్ణయించారు. దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం విత్తన గణపతిని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడారు.
Samayam Telugu విత్తన గణపతి ఆవిష్కరిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్
MP santosh kumar introduces Seed Ganesha programme


తాను ఇప్పటికే చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సీడ్ గణేష్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా సమయంలో గణపతి వేడుకల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరికి వారు తమ ఇళ్లలోనే విత్తన గణపతిని ప్రతిష్ఠించుకొని పూజించుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు. పూజల తర్వాత మొలకెత్తే వేప విత్తనాన్ని నాటుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. తద్వారా ప్రతీ ఇంటి ఆవరణలో ఒక వేప చెట్టు ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆశయం కూడా నెరవేరుతుందని అన్నారు.

Also Read: undefined

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వీలైనన్ని విత్తన గణేష్‌లను పంచుతామని ఎంపీ తెలిపారు. ఇందుకోసం ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా విత్తన గణపతి పంపిణీలో పాల్గొనాలని సూచించారు. విత్తన గణపతి అంటే మట్టితో చేసిన వినాయక విగ్రహం లోపల విత్తనాన్ని ఉంచుతారు. పూజల అనంతరం దీన్ని నేరుగా భూమిలో ఉంచవచ్చు. దీనిద్వారా అందులోని విత్తనం మొలకెత్తుతుంది.

Don't Miss: రామ మందిరానికి మోదీ భూమిపూజ.. వేదికపై సాష్టాంగ నమస్కారం.. ఫోటోలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.