యాప్నగరం

నాగోబా జాతర ప్రారంభం.. కేస్లాపూర్‌లో కోలాహలం

Adilabad జిల్లా కేస్లాపూర్‌లో నాగోబా జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. మెస్రం మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మర్రిచెట్ల వద్ద వారికి ఘనస్వాగతం లభించింది.

Samayam Telugu 24 Jan 2020, 11:42 pm
దివాసీ గిరిజనుల పండుగ నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కెస్లాపూర్‌లో గ్రామంలో ఆదివాసీలు గురువారం (జనవరి 23) తమ ఆరాధ్యదైవానికి పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో గురువారం అర్దరాత్రి నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులతో పాటు ఆయా ప్రాంతాల నుంచి ఆదివాసీ గిరిజనులు, భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో నాగోబా ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. మెస్రం మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Samayam Telugu nagoba


మెస్రం వంశీయులు సంప్రదాయ పూజలతో మహాపూజలకు శ్రీకారం చుట్టారు. పవిత్ర గంగాజలంతో మర్రిచెట్ల వద్ద బస చేసిన మెస్రం వంశీయులు కెస్లాపూర్‌ గ్రామంలోని పురాతన నాగోబా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగోబా విగ్రహాన్ని ఊరేగింపుగా తరలించారు. కెస్లాపూర్‌ నుంచి నాగోబా విగ్రహాన్ని తీసుకొస్తున్న మెస్రం వంశీయులను మర్రిచెట్లకు వెళ్లేదారిలో మర్రిచెట్ల వద్ద బసచేసిన మెస్రం వంశీయులు స్వాగతం పలికారు.

పురాతన నాగోబా విగ్రహాలతో పాటు నాగోబా దేవత, సతీదేవతలకు మెస్రం వంశీయులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. భాన్‌దేవతలతో పాటు పెర్సపేన్‌ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి నాగోబా ఆలయంలోకి వచ్చారు. మెస్రం వంశం 22 కితలకు చెందిన మహిళలకు పెద్దల చేతుల మీదుగా మట్టికుండలను పంపిణీ చేశారు. మహిళలు మర్రిచెట్ల ప్రాంతంలోని కోనేటి నీటిని తీసుకొచ్చారు. ఆ నీటితో మట్టిని తడిపి పాముల పుట్టలతో పాటు బౌల్‌దేవతను తయారు చేసి పూజలు నిర్వహించారు. మహాపూజల అనంతరం ముఖ్య అతిథులు, ఇతర భక్తులకు నాగోబాకు పూజలు చేసేందుకు అవకాశం కల్పించారు.

Also Read: మేడారం జాతరకు ప్రత్యేక టూరిజం ప్యాకేజీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.