యాప్నగరం

కేటీఆర్‌కు ఎన్‌జీటీ నోటీసులు.. రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో సర్కారుకు చిక్కులు!

ఫామ్ హౌస్ నిర్మాణంలో జీవో 111ను ఉల్లంఘించారనే ఆరోపణలతో రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో నేషనల్ గ్రీన్ ట్రైబున్యుల్ నోటీసులు జారీ చేసింది. నిజనిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

Samayam Telugu 5 Jun 2020, 2:00 pm
హైదరాబాద్: ఫామ్ హౌస్ నిర్మాణంలో జీవో 111ను ఉల్లంఘించారనే కారణంతో మంత్రి కేటీఆర్‌కు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలితోపాటు హెచ్ఎండీఏకు కూడా గ్రీన్ ట్రైబున్యల్ నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందనగా గ్రీన్ ట్రైబ్యునల్ ఈ నోటీసులు జారీ చేసింది.
Samayam Telugu national green tribunal issues notice to ktr ts govt and tspcb on illegal farmhouse construction
కేటీఆర్‌కు ఎన్‌జీటీ నోటీసులు.. రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో సర్కారుకు చిక్కులు!


కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీని కూడా ఎన్జీటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హెచ్ఎండీఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. 2018లో జీవో 111ను జారీ చేయగా.. దాని అమలుకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఎన్‌జీటీ ఈ కమిటీని ఆదేశించింది.

జీవో 111 ప్రకారం గండిపేటలోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ సమీప ప్రాంతాల్లో భనవ నిర్మాణాలపై పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించాయి. రంగారెడ్డి జిల్లాలో 60-80 గ్రామాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి.

కేటీఆర్‌దిగా చెబుతున్న ఫామ్ హౌస్‌ను ఆంక్షలు ఉన్న ప్రాంతాల్లో నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాను ఫామ్ హౌస్‌ను నిర్మించలేదని కేవలం లీజ్‌కు మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ గతంలో వివరణ ఇచ్చారు. ఈ ఫామ్‌హౌస్‌ను రేవంత్ డ్రోన్లతో ఫొటోలు తీశాడు. ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్లను ఉపయోగించడంతో పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.