యాప్నగరం

తెలంగాణలో బ్రిటన్ వైరస్ ? పూణెకు శాంపిల్స్

రాష్ట్రానికి తాజాగా 355మంది వచ్చారు. అయితే వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. కొత్త రకం వైరస్ ప్రస్తుతం ఉన్న దానికంటే రెట్టింపుగా వ్యాపిస్తుందని తేలింది.

Samayam Telugu 23 Dec 2020, 12:33 pm
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా... మరో కొత్త రకం వైరస్ ప్రజల్ని వణికిస్తోంది. ఇప్పటికే బ్రిటన్‌లో విజృంభిస్తున్న కొత్త తరహా వైరస్‌తో మన దేశం కూడా అలర్ట్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలో గత నెల రోజుల నుంచి యూకే, తదితర ప్రాంతాల నుంచి సుమారుగా 3 వేల మంది ప్రయాణికులు వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే రెండు వారాలుగా నేరుగా రాష్ట్రానికి 355 మంది తెలంగాణ వచ్చినట్లు గుర్తించి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు.
Samayam Telugu తెలంగాణలోకి కొత్త వైరస్
new virus in Telangana


అయితే తాజాగా వైరస్ సోకిన వారిలో కొత్త తరహా వైరస్‌ ఉందా.. ? లేదా అని గుర్తించేందుకు నమూనాలను పుణె ప్రయోగశాలకు పంపించినట్లు ప్రజా ఆరోగ్య చాలకులు డా. శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు డా. రమేష్‌ రెడ్డి స్పష్టం చేశారు. యూకేలో వణికిస్తున్న కొత్త తరహా వైరస్‌ వేగంగా వస్తరిస్తుందని ప్రస్తుతమున్న దాని కన్న రెట్టింపు వ్యాప్తి చెందుతుందని తేలింది. అయితే రానున్న పండగలను కొవిడ్‌ నియమ నిబంధనలు పాటించే జరపుకోవాలని వారు సూచించారు.

Read More: TS: భారీగా తగ్గిన కరోనా పరీక్షల ధరలు.. ఇప్పుడు చాలా చవక, కొత్త ధరలివే..

మరోవైపు బ్రిటన్‌లో బయటపడి ప్రపంచాన్ని అలజడికి గురిచేస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌ అంత డేంజర్ కాదంటున్నారు నిపుణులు. సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర మాట్లాడుతూ ఈ వైరస్ లక్షణాలన్నీ పాతవే అన్నారు. ఇప్పుడున్న నిర్ధారణ పరీక్షలతోనే పరీక్షించుకోవచ్చని వివరించారు. అయితే గత వైరస్‌తో పోలిస్తే ఎక్కువ వ్యాప్తికి కారణమవుతుండటమే ఆందోళనకరమన్నారు. కేసులు పెరిగితే ఆసుపత్రులు, నిర్వహణ క్లిష్టం అవుతుందన్నారు. వైరస్ ప్రమాదకరం కాదని నిర్లక్ష్యం చేస్తే మాత్రం విస్పోటనం తప్పదని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.