యాప్నగరం

తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల వారికి అలర్ట్!

Telangana Weather: తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వివరించింది.

Samayam Telugu 10 Oct 2020, 4:35 pm
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం శనివారం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తం కొనసాగుతుందని చెప్పింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
weather photo


తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది.

ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని.. ఆది, సోమవారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురవగా.. రంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ, జనగామ, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జగిత్యాల, కుమ్రం భీం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి.

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని గండిపేటలో 125.8 మిల్లీమీటర్లు, ఖమ్మం జిల్లా కొండమల్లపల్లిలో 117.5 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.